సూపర్ 8 ఖాళీ బెర్తులు మూడే- ఆస్ట్రేలియాకు ద్వారాలు మూసుకుపోయాయ్

టీ20 వరల్డ్ కప్‌లో మరో సంచలనం. మొన్నటికి మొన్న జింబాబ్వే చేతిలో మట్టికరిచిన ఆస్ట్రేలియా.. ఇప్పుడు శ్రీలంక చేతిలో చావుదెబ్బ తిన్నది. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో ఆస్ట్రేలియా దాదాపుగా టీ20 వరల్డ్ కప్ రేసు నుంచి వైదొలగినట్టే. అదే సమయంలో శ్రీలంక సూపర్ 8 దశకు చేరింది. అర్హత సాధించింది. ఆస్ట్రేలియా సూపర్ 8 ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. దీంతో ఆస్ట్రేలియా ప్రపంచకప్ ప్రయాణం ముగిసినట్లే.

పాథుమ్ నిశ్శంక ఈ మ్యాచ్ లో తడాఖా చూపాడు. 52 బంతుల్లో సెంచరీ ఊదిపడేశాడు. నాటౌట్ గా నిలిచాడు. ఈ20 వరల్డ్ కప్ లో ఇదే తొలి సెంచరీ. టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న శ్రీలంకకు ఆస్ట్రేలియా 182 పరుగులను నిర్దేశించింది. శ్రీలంక దీనిని 18 ఓవర్లలోనే అందుకుంది. సంచలనం సృష్టించింది. అంతకుముందు జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓటమి వారి సూపర్ 8 అవకాశాలకు అడ్డంకిగా మారింది.

Australia Qualification Scenario Hinges on Zimbabwe as 5 Teams Secure Super 8 Spots including India

ఆస్ట్రేలియా ఓడిపోవడం, శ్రీలంక సూపర్ 8 రౌండ్ కు అర్హత సాధించడంతో క్వాలిఫికేషన్ రేసు ఉత్కంఠగా మారింది. భారత్, వెస్టిండీస్‌ జట్లు ఇప్పటికే అర్హత సాధించగా తాజాగా సోమవారం దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, శ్రీలంక తమ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. ఇక మిగిలింది మూడు ఖాళీ బెర్తులు మాత్రమే. గ్రూప్ ఎ లో భారత్ తన తొలి మూడు మ్యాచ్‌లలో గెలిచి సూపర్ 8 అర్హతను ఖరారు చేసుకుంది. ఈ గ్రూప్‌లో పాకిస్తాన్ ఇప్పటికీ బలమైన పోటీదారు. నమీబియాతో జరిగే చివరి మ్యాచ్‌లో గెలిస్తే నెక్స్ట్ రౌండ్ కు చేరుతుంది. ఓడిపోతే అమెరికా అర్హత సాధిస్తుంది.

గ్రూప్ బీ నుంచి సూపర్ 8కు తొలి జట్టు శ్రీలంక. ఇదే గ్రూప్ లో ఉన్న ఆస్ట్రేలియా అర్హత సాధించాలంటే తన తదుపరి మ్యాచ్ లో ఒమన్ పై ఖచ్చితంగా గెలవాలి. భారీ రన్ రేట్ ను సాధించాలి. అదే సమయంలో జింబాబ్వే.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోవాలి. దాని నెట్ రన్ రేట్.. ఆస్ట్రేలియా కంటే తక్కువగా ఉండాలి. జింబాబ్వే ఒక్క మ్యాచ్ గెలిచినా ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఒకవేళ జింబాబ్వేను ఓడించి ఐర్లాండ్ నాలుగు పాయింట్లు సాధించినా గానీ ఆస్ట్రేలియాకు అవకాశం ఉంటుంది. అక్కడ కూడా ఆస్ట్రేలియాకు ఐర్లాండ్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ తప్పనిసరి.

గ్రూప్ సీలో ఇంగ్లాండ్ సోమవారం ఇటలీని 24 పరుగుల తేడాతో చిత్తు చేసి టోర్నమెంట్‌లో మూడో విజయం నమోదు చేసింది. దీనితో సూపర్ 8కు అర్హత సాధించింది. ఈ గ్రూప్ లో సూపర్ 8కు చేరిన మొదటి జట్టు వెస్టిండీస్. మూడు మ్యాచ్‌లలో మూడు విజయాలతో వెస్టిండీస్ ఇప్పటికే ఈ రౌండ్‌కు చేరింది.

గ్రూప్ డీలో సోమవారం యూఏఈపై అఫ్ఘనిస్తాన్ విజయం సాధించడంతో దక్షిణాఫ్రికా సూపర్ 8కు అర్హత పొందింది. న్యూజిల్యాండ్ తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో కెనడాను ఓడిస్తే ప్రొటీస్‌తో పాటు ముందుకు వెళ్తుంది. అఫ్ఘనిస్తాన్‌కు కూడా ఇంకా అవకాశం మిగిలేవుంది. కెనడాపై భారీ విజయం సాధించడం ద్వారా అర్హత పొందవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+