క్రికెట్ కు గుడ్ బై చెప్పిన RCB మాజీ ప్లేయర్..!!

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ మ్యాచ్ లల్లో కూడా మెరుపులు మెరిపించిన ఈ ప్లేయర్.. అన్ని ఫార్మట్లకూ గుడ్ బై చెప్పాడు. ఏకంగా నాలుగు సీజన్లల్లో తడాఖా చూపాడు. అటు బిగ్ బాష్ లీగ్స్ లోనూ సత్తా చాటుతున్నాడు. సిడ్నీ సిక్సర్స్‌ తరఫున బీబీఎల్ లో ఆడుతున్నాడీ పేసర్. ఆ ఫ్రాంఛైజీతో ఇంకాో ఓ సంవత్సర కాలం కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ- ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అతనే కేన్ రిచర్డ్‌సన్. బిగ్ బాష్ లీగ్ తొలి సీజన్ నుంచే కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఇక్కడి నుంచే అతని అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానం ఆరంభమైంది. ఆ తర్వాత ఐపీఎల్ లోనూ అడుగు పెట్టేలా చేసింది. అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్‌బోర్న్ రెనెగెడ్స్‌లో సుదీర్ఘకాలం పాటు కొనసాగాడు. 2018-19 సీజన్ లో రెనెగెడ్స్‌తో టైటిల్ గెలిచాడు. 142 వికెట్లు, 23.21 యావరేజ్, 7.87 ఎకానమీతో బీబీఎల్ చరిత్రలో అయిదో అత్యధిక వికెట్ టేకర్ గా నిలిచాడు.

Australian Pace Bowler Kane Richardson Announces Retirement from Professional Cricket after BBL

బీబీఎల్ ముగింపుతో ఇక తన కేరీర్ కూడా పుల్ స్టాప్ పెట్టాడు రిచర్డ్‌సన్. రిటైర్మెంట్ విషయాన్ని మొదట ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించాడు. అనంతరం ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ACA)కు ఈ విషయాన్ని తెలియజేశాడు. రిచర్డ్‌సన్ రిటైర్మెంట్ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ధారించింది. ఈ బీబీఎల్ సీజన్ ముగింపుతో ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నానని రిచర్డ్‌సన్ చెప్పాడు. 2009లో అరంగేట్రం చేసినప్పటి నుండి వందశాతం కమిట్మెంట్ తో ఆడానని, సుదీర్ఘ కేరీర్ ను ముగించడానికి ఇది సరైన సమయమ పేర్కొన్నాడు.

తన కెరీర్‌ను తీర్చిదిద్దిన కోచ్‌లు, బీబీఎల్, ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, క్రికెట్ ఆస్ట్రేలియాకు రిచర్డ్‌సన్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశాడు. తోటి ఆటగాళ్లతో పాటు ముఖ్యంగా సౌత్ ఆస్ట్రేలియా, నార్తర్న్ టెరిటరీకి చెందిన మద్దతుదారులకు రిచర్డ్‌సన్ కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి, ప్రపంచవ్యాప్తంగా గల అనేక ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించడం తన అదృష్టమని, ఈ అవకాశం తనకు అంత తేలికగా దక్కలేదని వ్యాఖ్యానించాడు.

రిచర్డ్‌సన్ ఆస్ట్రేలియా తరఫున 25 వన్డేలు, 36 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. యూఏఈలో 2021 టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. 2019 వన్డే ప్రపంచ కప్‌, టీ20 వరల్డ్ కప్‌లోనూ ఆడాడు. రిచర్డ్‌సన్ ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ లో నాలుగు సీజన్లు, టీ20 బ్లాస్ట్, హండ్రెడ్, ఐఎల్టీ20 వంటి లీగ్‌లలో రాణించాడు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, పూణే వారియర్స్ కు ప్రాతినిథ్యాన్ని వహించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+