ఉప్పల్ స్టేడియంలో స్టాండ్ పేరు తొలగింపుపై అజహరుద్దీన్ ఫైర్

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ హైదరాబాద్ క్రికెట్ సంఘం(HCA) అధ్యక్షుడు (Mohammad Azharuddin) పేరున్న విషయం తెలిసిందే. అయితే, దాన్ని తొలగించాలని తొలగించాలంటూ హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య శనివారం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలపై అజహరుద్దీన్ ఘాటుగా స్పందించారు.

స్టాండ్ పేరు మార్పు విషయాన్ని హైకోర్టుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఇందులో ఎలాంటి కుట్రకోణం, స్వప్రయోజనాలు లేవని, దీనిపై తాను ఎలాంటి కామెంట్ చేయదల్చుకోలేదన్నారు అజహరుద్దీన్. ఆ స్థాయికి దిగజారాలని అనుకోవడం లేదన్నారు. ఈ అసోసియేషన్‌ను చూసి క్రికెట్ ప్రపంచం నవ్వుతోందని ఎద్దేవా చేశారు.

Azharuddin fires back at removal of stand name at Uppal Stadium

తనది 17 ఏళ్ల క్రికెట్ కెరీర్ అని.. దాదాపు పదేళ్లపాటు టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్నట్లు అజహరుద్దీన్ తెలిపారు. సారథిగా డిస్టింక్షన్‌లో పాసైన వ్యక్తినని తెలిపారు. హైదరాబాద్‌లో క్రికెటర్లను ఇలాగేనా గౌరవించేది? అని ప్రశ్నించారు. ఇది చాలా బాధాకరమన్నారు. దీనిపై తప్పకుండా కోర్టుకు వెళ్తానని చెప్పారు. తనకు వందశాతం న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు అజహరుద్దీన్ తెలిపారు.

కాగా, హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అజహరుద్దీన్ తన పేరును స్టాండ్‌కు పెట్టడం సరైన నిర్ణయం కాదని, ఇందులో విరుద్ధమైన ప్రయోజనాలున్నాయని అంబుడ్స్‌మన్ అభిప్రాయపడ్డారు. వెంటనే స్టాండ్‌కు అజహరుద్దీన్ పేరును తొలగించడంతోపాటు క్రికెట్ మ్యాచ్‌ల టికెట్లపైనా ఆ ప్రస్తావన లేకుండా చూడాలని హెచ్‌సీఏను అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశించారు. 2019లో ఆ స్టాండ్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేరు ఉండటం గమనార్హం. దాన్ని అజహరుద్దీన్ స్టాండ్‌గా మార్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+