బాబర్ ఆజమ్ దెబ్బకు విరాట్ కోహ్లీ రికార్డ్ అవుట్

పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ వన్డే క్రికెట్‌లో ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. శ్రీలంకతో జరిగిన త్రైపాక్షిక సిరీస్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ ఓపెనర్ హషీమ్ ఆమ్లా పేరిట ఉన్న సుదీర్ఘ రికార్డును బాబర్ తిరగరాశాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కూడా మూడో స్థానానికి దిగిపోవాల్సొచ్చింది.

పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న త్రైపాక్షిక వన్డే సిరీస్ మొదటి మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ 45 పరుగులతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అర్ధశతకం చేసే అవకాశాన్ని తృప్తిలో చేజార్చుకున్నప్పటికీ, ఈ ఇన్నింగ్స్‌తోనే ఆయన అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ మైలురాయిని దాటాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 16,000 పరుగులు పూర్తి చేసుకున్న అయిదో పాకిస్తాన్ బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.

Babar Azam has now scored the most ODI runs after 141 innings surpassing Hashim Amla Virat Kohli

వన్డే క్రికెట్ చరిత్రలో 141 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పటివరకు హషీమ్ ఆమ్లా అగ్రస్థానంలో ఉండేవాడు. 141వ ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి 6,626 పరుగులు సాధించాడు ఆమ్లా. బాబర్ ఆజమ్ దీన్ని తుడిచిపెట్టాడు. 6,671 పరుగులతో ఆ రికార్డును దాటి మొదటి స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన తొలి 141 వన్డే ఇన్నింగ్స్‌లలో 6,224 పరుగులు చేసి ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

మాపై పెట్టే శ్రద్ధ.. కాస్తయినా వీళ్లపై పెట్టండి: టైగర్ ష్రాఫ్ కాల్పులపై అభిజిత్ దిప్కే
మాపై పెట్టే శ్రద్ధ.. కాస్తయినా వీళ్లపై పెట్టండి: టైగర్ ష్రాఫ్ కాల్పులపై అభిజిత్ దిప్కే

బాబర్ తన వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు 141 ఇన్నింగ్స్‌లలో 53.37 సగటుతో 6,671 పరుగులు సాధించాడు. ఇందులో 20 శతకాలు, 38 అర్ధశతకాలు ఉన్నాయి. త్రైపాక్షిక సిరీస్ లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్ లో 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సల్మాన్ ఆఘా అద్భుత శతకంతో నిర్ణీత ఓవర్లలో శ్రీలంకకు 306 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

కాల్పుల్లో గాయపడ్డ టైగర్ ష్రాఫ్ ఫస్ట్ ఫొటో: డిప్యూటీ సీఎం రాక.. !!
కాల్పుల్లో గాయపడ్డ టైగర్ ష్రాఫ్ ఫస్ట్ ఫొటో: డిప్యూటీ సీఎం రాక.. !!

సల్మాన్ ఆఘా కేవలం 90 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 107 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను పాకిస్తాన్ బౌలర్లు నడ్డివిరిచారు. 268 పరుగులకు ఆ జట్టు ఆలౌట్ అయింది. పవన్ రత్నాయకే- 79, జనిత్ లియానగె- 60, కమిందు మెండిస్- 44 పరుగులతో రాణించినప్పటికీ.. తోటి బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజ్ లో నిల్చోలేకపోయారు. కేప్టెన్ షహీన్ అఫ్రిది మూడు వికెట్లతో సత్తా చాటాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+