IPL నుంచి రూ. 9.20 కోట్ల స్టార్ ప్లేయర్ అవుట్: బీసీసీఐ అత్యవసర ఆదేశాలు

బీసీసీఐ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను తక్షణమే జట్టు నుంచి తప్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ను సూచించింది. దీనికి గల కారణాలను సమగ్రంగా వెల్లడించలేదు గానీ- "తాజా పరిణామాల" వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను జట్టులోకి తీసుకోవడం పట్ల నెలకొన్న వివాదం నేపథ్యంలో బీసీసీఐ ఈ చర్య తీసుకున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా చెప్పారు.

ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ముస్తాఫిజుర్‌ను విడుదల చేయాలని కేకేఆర్‌కు సూచించామని, అవసరమైతే ప్రత్యామ్నాయ క్రీడాకారుడికి అనుమతిస్తామని ఆయన చెప్పారు. దీంతో ఈ ఏడాది జరిగే ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మాన్ తప్పుకోవడం ఖాయమైంది. అతని స్థానంలో మరో ఆల్ రౌండర్ ను తీసుకోవడానికి, ప్రత్యామ్నాయ మార్గాలను కేకేఆర్ యాజమాన్యం అన్వేషిస్తోంది.

BCCI Forces KKR to Free Mustafizur Rahman Due to Recent Developments

కొంతకాలంగా బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ కు చెందిన యువకుడిని కొట్టి చంపారు బంగ్లాదేశ్ లో. మృతదేహాన్ని చెట్టుకు కట్టి తగులబెట్టారు. ఆ తర్వాత కూడా దాడులు కొనసాగుతోన్నాయి. రాజధాని ఢాకాలోని భారత హైకమిషన్ కార్యాలయాన్నీ ముట్టించడం వంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ ఐపీఎల్ లో బంగ్లాదేశ్ కు చెందిన ప్లేయర్లెవరినీ కూడా ఆడించకూడదనే డిమాండ్ ఊపందుకుంది.

అదే సమయంలో కేకేఆర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ తో కాంట్రాక్ట్ కుదుర్చుకోవడంపై దుమారం చెలరేగింది. ఐపీఎల్‌లో బంగ్లాదేశ్ ఆటగాడి చేరికకు బీజేపీ, శివసేనలకు చెందిన పలువురు నాయకులు అభ్యంతరం చెప్పారు. కేకేఆర్ కో ఓనర్, స్టార్ హీరో షారుఖ్ ఖాన్.. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోన్నారంటూ బీజేపీ నాయకుడు సంగీత్ సోమ్ ఆరోపించారు. బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్‌లో అనుమతించకూడదని శివసేన నాయకుడు కృష్ణ హెగ్డే డిమాండ్ చేశారు.

ఆధ్యాత్మిక గురువు రామభద్రాచార్య సైతం ఈ సమస్యపై షారుఖ్ ఖాన్‌ను తప్పుపట్టారు. ఈ పరిణామాల్లో తాజాగా బీసీసీఐ జోక్యం చేసుకుంది. ముస్తాఫిజుర్ ను తప్పించాలని ఆదేశించింది. దీనిపై కేకేఆర్ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు గానీ బీసీసీఐ ఆదేశాలను పాటించడం ఖాయమని తెలుస్తోంది. మొన్నటి వేలం పాటలో ముస్తాఫిజుర్ కు మంచి డిమాండ్ పలికింది. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తీవ్ర పోటీ పడి మరీ కేకేఆర్ 9.20 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+