ఆసియాకప్ తీసుకెళ్లిపోయిన ఏసీసీ ఛీఫ్..! బీసీసీఐ కీలక నిర్ణయం..!
ఆసియాకప్ ఫైనల్లో పాకిస్తాన్ పై ఘన విజయం సాధించి 9వ సారి ఈ టోర్నీ టైటిల్ గెల్చుకున్న టీమిండియా మ్యాచ్ ముగిశాక ఇచ్చే కప్పును ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛీఫ్, పీసీబీ ఛీఫ్ కూడా అయిన మొహసిన్ నక్వీ నుంచి తీసుకునేందుకు నిరాకరించింది. ముందుగా రన్నరప్ అయిన పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ అఘా చెక్ తీసుకుని వెళ్లిపోగా.. ఆ తర్వాత రావాల్సిన టీమిండియా మాత్రం పీసీబీ ఛీఫ్ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు ఇష్టపడలేదు. ఇదే అదనుగా నక్వీ ఆసియా కప్ ట్రోఫీని తీసుకెళ్లిపోయారు. దీంతో మరో వివాదం తలెత్తింది.
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏసీసీ ఛీఫ్ హోదాలో ఉన్న నక్వీ నుంచి ఆసియాకప్ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించి జట్టుతో పాటు దూరంగా ఉండిపోయాడు. దీంతో దాదాపు గంట సేపు వేచి ఉన్న మొహసిన్ నక్వీ ట్రోఫీని తీసుకుని ఇతర అధికారులతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో భారత ఆటగాళ్లు షాకయ్యారు. ఈ నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛీఫ్, పాకిస్తాన్ మంత్రి కూడా అయిన నక్వీపై అధికారికంగా ఐసీసీకి ఫిర్యాదు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.

ఆసియాకప్ ఫైనల్ తర్వాత భారత ఆటగాళ్లు ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించడాన్ని సమర్ధించుకున్న బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా.. తమ దేశంపై యుద్దం ప్రకటించిన వ్యక్తి నుంచి ట్రోఫీ ఎలా తీసుకుంటామని ప్రశ్నించారు. దీనిపై నవంబర్ లో జరిగే ఐసీసీ సమావేశంలో తమ నిరసన తెలియజేస్తామని ప్రకటించారు. తాము నక్వీ నుంచి ట్రోఫీ తీసుకోకూడదని నిర్ణయించుకున్నామని, దానర్థం ఆయన ట్రోఫీని, మెడల్స్ ను హోటల్ కు తీసుకెళ్లిపొమ్మని కాదని బీసీసీఐ కార్యదర్శి తెలిపారు.

🚨MOHSIN NAQVI HAS LEFT THE GROUND WITH ASIA CUP TROPHY AFTER INDIA REFUSED TO TAKE FROM HIM 🤯#INDvPAK #indvspak2025 #IndianCricket #INDvsPAK #PAKvsIND pic.twitter.com/Lf61pr5XRD
— RK Azlaan FCB (@Azlaan_FCB) September 28, 2025
ఇది ఊహించని పరిణామం అని, పిల్ల చేష్ట అని బీసీసీఐ కార్యదర్శి సైకియా తెలిపారు. నవంబర్ మొదటి వారంలో దుబాయ్‌లో జరగనున్న ఐసిసి సమావేశంలో తాము ఐసీసీ వద్ద దీనిపై బలమైన నిరసనను వ్యక్తం చేయబోతున్నట్లు తెలిారు. నఖ్వీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధిపతి, వారి దేశ మంత్రి కూడా అన్నారు. మరోవైపు పాకిస్తాన్ తో ఆసియాకప్ లో ఆడిన 3 మ్యాచ్ లూ గెలిచిన టీమిండియా స్వదేశంలో అభిమానులకు కానుక ఇచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications