బెన్ స్టోక్స్ ఫేషియల్ సర్జరీ.. అంత అవసరం ఏమొచ్చింది ?!
ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్.. ఫేషియల్ సర్జరీ చేయించుకున్నాడు. ఈ సర్జరీ విజయవంతమైంది. ముఖానికి గాయం కావడంతో అతనికి ఈ సర్జరీ అవసరమైంది. ఈ విషయాన్ని స్టోక్స్ స్వయంగా వెల్లడించాడు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశాడు. గాయంపై తాజా సమాచారాన్ని తెలియజేశాడు. "చూడటానికి అలా అనిపించకపోవచ్చు గానీ.. సర్జరీ విజయవంతమైంది" అని కామెంట్స్ దీనికి యాడ్ చేశాడు.
ఈ ఆపరేషన్ విషయాన్ని బెన్ స్టోక్స్ కిందటి వారమే సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. గాయం గురించి వివరించాడు. "బంతి పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది" అని సరదాగా వ్యాఖ్యానించారు. యాషెస్ టెస్ట్ సిరీస్ లో భాగంగా కిందటి నెల ఆస్ట్రేలియాతో జరిగిన అయిదో మ్యాచ్ అతో అతను గాయపడ్డాడు. అప్పుడు జరిగిన అడక్టార్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఫలితంగా ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

2023 ప్రపంచ కప్ తర్వాత వన్డే ఇంటర్నేషనల్స్ కు దూరం అయ్యాడు స్టోక్స్. అప్పటి నుంచి ఇంగ్లాండ్ తరఫున వైట్-బాల్ క్రికెట్ ఆడట్లేదు. అలాగే ప్రస్తుత టీ20 ప్రపంచ కప్‌కు కూడా ఎంపిక కాలేదు. జూన్‌లో న్యూజిలాండ్‌తో జరిగే ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి రావాలని భావిస్తోన్నాడు. దీనికంటే ముందు దుర్హమ్ తరఫున కౌంటీ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ లో అతను ఆడే అవకాశం ఉంది.
ఫిబ్రవరి-మార్చిలో అబుదాబిలో పాకిస్థాన్ షాహీన్స్‌తో జరిగే వైట్ బాల్ సిరీస్‌కు ఇంగ్లాండ్ లయన్స్ కోచింగ్ స్టాఫ్‌లో స్టోక్స్, మొయిన్ అలీ, ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో కలిసి ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ కోసం 17 మందితో కూడిన టీ20, 16 మందితో కూడిన వన్డే టీమ్ టీమ్ ను ఇదివరకే ప్రకటించారు.
ఇంగ్లాండ్ లయన్స్ టీ20 జట్టు: సన్నీ బేకర్, లూక్ బెంకన్‌స్టెయిన్, జేమ్స్ కోల్స్, సామ్ కుక్, జోర్డాన్ కాక్స్ (కెప్టెన్), స్కాట్ కర్రి, కాల్విన్ హారిసన్, ఎడ్డీ జాక్, సాఖిబ్ మహమూద్, బెన్ మెక్‌కిన్నే, టామ్ మూర్స్, డాన్ మౌస్లీ, మాట్ రెవిస్, విల్ స్మీడ్, నాథన్ సోటర్, మిచెల్ స్టాన్లీ, ఆసా ట్రైబ్.
ఇంగ్లండ్ లయన్స్ వన్డే టీమ్: సన్నీ బేకర్, లూక్ బెంకన్‌స్టెయిన్, జేమ్స్ కోల్స్, సామ్ కుక్, జోర్డాన్ కాక్స్, స్కాట్ కర్రి, కాల్విన్ హారిసన్, ఎడ్డీ జాక్, బెన్ మెక్‌కిన్నే, డాన్ మౌస్లీ (కెప్టెన్), లియామ్ ప్యాటర్సన్-వైట్, మాథ్యూ పాట్స్, మాట్ రెవిస్, జేమ్స్ రేవ్, మిచెల్ స్టాన్లీ, ఆసా ట్రైబ్, జేమ్స్ వార్టన్.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications