బెంగళూరులో IPL మ్యాచ్ లపై వీడిన సస్పెన్స్- ఇక అన్నీ ఆ స్టేడియంలోనే
డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కి భారీ ఊరట లభించింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో తమ సొంత మ్యాచ్‌లను రెండు కొత్త స్టేడియాల్లో ఆడటానికి ఏర్పాట్లు చేసుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాజా పరిణామం చోటు చేసుకుంది. తన హోమ్ గ్రౌండ్ కు ప్రత్యామ్నాయంగా నవీ ముంబైలోని డీవై పాటిల్, ఛత్తీస్ గఢ్ రాయ్‌పూర్‌లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియాలను ఇకపై ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్‌లుగా మార్చుకోవాలని భావిస్తోన్న తరుణంలో ఆర్సీబీకి గుడ్ న్యూస్ అందింది.
బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఎం చిన్నస్వామి స్టేడియానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లను తిరిగి నిర్వహించడానికి అనుమతి లభించింది. ఈ విషయాన్ని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) కొద్దిసేపటి కిందటే అధికారికంగా ప్రకటించింది. బెంగళూరులోని చారిత్రాత్మక చిన్నస్వామి స్టేడియంలో అంతర్జాతీయ, IPL మ్యాచ్‌లను నిర్వహించడానికి కర్ణాటక ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని తెలిపింది. షరతులతోె కూడిన అనుమతి ఇచ్చిందని పేర్కొంది.

ఐపీఎల్ 2025 టైటిల్ సాధించిన తర్వాత బెంగళూరులో చోటు చేసుకున్న విషాదకర సంఘటనల నేపథ్యంలో ఫ్రాంఛైజీ మళ్లీ బెంగళూరుకు తిరిగి రావడానికి సుముఖత చూపడం లేదనే వార్తల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. వాస్తవానికి, ఐపీఎల్ 2008లో ప్రారంభమైనప్పటి నుండి ఆర్సీబీ తన సొంత మ్యాచ్‌లన్నింటినీ చిన్నస్వామి స్టేడియంలోనే ఆడుతూ వస్తోంది. గత ఏడాది విజయోత్సవ వేడుకల అనంతరం స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట పరిస్థితిని పూర్తిగా మార్చేసింది.
ఈ కారణంగా ఈ స్టేడియాన్ని రాబోయే టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్ వేదికల జాబితా నుండి మినహాయించారు. విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లను కూడా ఈ ప్రతిష్టాత్మక స్టేడియం నుండి BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు తరలించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించిన జస్టిస్ మైఖేల్ డికున్హా నివేదికలోని సిఫార్సులను సమర్థవంతంగా అమలు చేయాలనే ప్రధాన షరతుతో స్టేడియానికి తిరిగి మ్యాచ్‌లను నిర్వహించేందుకు అనుమతి దక్కింది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications