KL Rahul:మొదటి టెస్ట్ మ్యాచ్ లో కాంట్రవర్షియల్ మూమెంట్..డీఆర్ఎస్ దెబ్బకు రాహుల్ ఔట్

KL Rahul Dismissal: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో తొలి సెషన్ లో భారత్ 150 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలోనే మొదిటి టెస్ట్ మ్యాచ్ లో ఓ అనూహ్య ఘటన కాంట్రవర్సీకి దారి తీసింది. థర్డ్ అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం కారణంగా భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ పెవిలియన్ చేరాల్చి వచ్చింది.

లంచ్ బ్రేక్ కు ముందు మిచెల్ స్టార్క్ 23వ ఓవర్ను బౌలింగ్ చేశాడు. మిచెల్ స్టార్క్ వేసిన ఓ బంతి స్వింగ్ చేస్తూ ఆసీస్ కీపర్ అలెక్స్ కేరే చేతుల్లోకి వెళ్లింది. రాహుల్ ఆ బంతిని కొట్టడానికి ప్రయత్నిస్తూ బ్యాట్ ను ముందుకు ఊపే ప్రయత్నం చేశాడు. ఆ బంతి బ్యాట్ కు దగ్గరగా కీపర్ చేతుల్లోకి వెళ్లింది. కీపర్ అలెక్స్ తో పాటు ఆసీస్ జట్టు అంతా ఔట్ అంటూ అప్పీల్ చేసింది. ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో దానిని నాటౌట్ గా ప్రకటించాడు. కానీ ఆసీస్ కెప్టెన్ డీఆర్ఎస్ తీసుకున్నాడు.

BGT Match KL Rahul Unhappy With Disputed DRS Verdict in Perth Test Match

సమీక్షలో బ్యాట్ ను తాకినట్లు క్లారిటీ ఇవ్వలేదు. కానీ బంతి ప్యాడ్ లను తాకడంతో క్లియర్ గా స్పైక్స్ వచ్చాయి. బంతి ప్యాడ్స్, బ్యాట్ కు ఒకేసారి దగ్గరగా వచ్చి క్లియర్ స్పైక్స్ రావడంతో అంపైర్ తన ప్రకటనను మార్చుకోవాల్సి వచ్చింది. కేఎల్ రాహుల్ ను అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో ఔట్ గా ప్రకటించగా.. పెవిలియన్ చేరాల్చి వచ్చింది.

అంపైర్ ప్రకటనతో కేఎల్ రాహుల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. థర్డ్ అంపైర్ మరో యాంగిల్ లో చెక్ చేయలేదని నిరాశను వ్యక్తం చేశాడు. అంపైర్ నిర్ణయంతో కేఎల్ రాహుల్ ఆగ్రహంతో తన తలను ఊపుతూ కోపంతో పెవిలియన్ వైపుకు రావడం క్లియర్ గా కనిపించింది. ఈ మ్యాచ్ లో తీసుకున్న ఈ నిర్ణయం డీఆర్ఎస్ సిస్టమ్ పై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. బంతి బ్యాట్ ను తాకిందా లేదా ప్యాడ్ ను తాకిందా అనే విషయాన్ని కూడా గుర్తించలేకపోయిందని క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం రాహుల్ ఔట్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయంలో అంపైర్లు తప్పుగా నిర్ణయం తీసుకున్నారని క్రీడాభిమానులు మండిపడుతున్నారు. కనీసం చెక్ చేయకుండానే నిర్ణయానికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేఎల్ రాహుల్ విషయంలో అన్యాయం జరిగిందని అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+