రాజకీయాల్లోకి టీమిండియా స్టార్ ప్లేయర్: లోక్‌సభ బరిలో

Mohammed Shami: దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. ఇంకో 10 రోజుల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు సమాయాత్తమౌతోన్నాయి. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న ఇండియా కూటమి.. ఈ ఎన్నికల ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే.. విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ-ఎన్డీఏ సంకీర్ణ కూటమిని ఓడించడానికి సర్వశక్తులనూ ఒడ్డుతోంది. అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ ఉపయోగించుకుంటోంది. దీనికి అనుగుణంగా ఎన్నికల మేనిఫెస్టోకు రూపకల్పన చేసింది.

BJP likely to field cricketer Mohammed Shami in the Lok Sabha polls from West Bengal

ఇందులో భాగంగా- ఆయా పార్టీలన్నీ కూడా గెలుపు గుర్రాల అన్వేషణలో పడ్డాయి. ఫలితంగా ఊహించని పేర్లు తెరమీదికి వస్తోన్నాయి. ఈ విషయంలో బీజేపీ నాలుగడుగులు ముందే ఉన్నట్టు కనిపిస్తోంది. కొత్త అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపే క్రమంలో భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్లపైనా కన్నేసింది.

టీమిండియా స్పీడ్ స్టర్ మహ్మద్ షమీని ఎన్నికల బరిలో నిలపాలని బీజేపీ నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో పార్టీ హైకమాండ్ ఇప్పటికే షమీతో సంప్రదింపులు సైతం జరిపిందని అంటున్నారు. మైనారిటీ ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టే క్రమంలో షమీ పేరును ప్రతిపాదించిందని సమాచారం.

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి షమీ గనక అంగీకరిస్తే- ఆయనను పశ్చిమ బెంగాల్ నుంచి రేసులో నిలపొచ్చు. మైనారిటీలు అధికంగా ఉండే బసీర్హట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి షమీని పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనికి అనుగుణంగా బసీర్హట్ లోక్‌సభ వికీపీడియా పేజీలోనూ షమీ పేరు కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

బసీర్హట్ లోక్‌సభ.. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. బీజేపీ ఒక్కసారి కూడా గెలవలేదిక్కడ. 2009తో జెండా పాతింది తృణమూల్. ఇప్పటికీ రెపరెపలాడుతూనే ఉంది. హాజీ నూరుల్ ఇస్లాం, ఇద్రిస్ అలీ, నుస్రత్ జహాన్.. ఇక్కడ విజయం సాధించారు. ప్రస్తుతం తృణమూల్ నాయకురాలు నుస్రత్ జహాన్ ఈ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు.

తృణమూల్ జైత్రయాత్రను అడ్డుకునే క్రమంలో మహ్మద్ షమీని బసీర్హట్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ బరిలో దింపాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు సంప్రదింపులు సైతం జరుగుతున్నాయి. దీనికి షమీ అంగీకరిస్తాడా? లేదా? అనేది తేలాల్సి ఉంది. కాలి గాయం వల్ల ప్రస్తుతం షమీ క్రికెట్‌కు దూరంగా ఉంటోన్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఆడట్లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+