రారా చూసుకుందాం .. ఢిల్లీ ఆటగాడిపై దూసుకెళ్లిన బుమ్రా
ఆదివారం ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.తిలక్ వర్మ అత్యధికంగా 59 పరుగులు (33 బంతుల్లో, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు.రయాన్ (41), సూర్యకుమార్ యాదవ్ (40) ,నామన్ ధీర్ (38*) విలువైన పరుగులు చేశారు.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ , విప్రాజ్ నిగమ్ చెరో 2 వికెట్లు తీశారు.ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను కేవలం 40 బంతుల్లో 89 పరుగులు (12 ఫోర్లు, 5 సిక్సర్లు) చేశాడు. అభిషేక్ పోరెల్ (33) , కెఎల్ రాహుల్ (15) కొంత సహకారం అందించారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో కర్ణ్ శర్మ 3 వికెట్లు, మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు తీశారు.ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.

బుమ్రా , కరుణ్ నాయర్‌ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కరుణ్ నాయర్ పరుగులు తీస్తున్న క్రమంలో, నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బుమ్రాను ఢీకొట్టాడు. ఇది ప్రమాదవశాత్తు జరిగినట్లుంది, కానీ బుమ్రా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఢీకొన్న తర్వాత, బుమ్రా కరుణ్ నాయర్‌తో వాగ్వాదానికి దిగాడు. కరుణ్ నాయర్ క్షమాపణ చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ, బుమ్రా శాంతించలేదు. పరిస్థితిని చక్కదిద్దడానికి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జోక్యం చేసుకున్నాడు. కరుణ్ నాయర్‌తో మాట్లాడి వివాదానికి ముగింపు పలికాడు.ఈ సంఘటన జరుగుతున్నప్పుడు, ముంబై ఇండియన్స్ ఆటగాడు రోహిత్ శర్మ వెనుక నుండి నవ్వుతూ, వ్యంగ్యంగా తల ఊపుతూ కనిపించాడు.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బుమ్రా ఆగ్రహానికి ప్రధాన కారణం కరుణ్ నాయర్ తన బౌలింగ్‌లో భారీగా పరుగులు చేయడమేనని కొందరు భావిస్తున్నారు. నాయర్ ఒక ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌లో రెండు సిక్సర్లు , ఒక ఫోర్‌తో సహా 18 పరుగులు రాబట్టాడు.దాన్ని తట్టుకోలేని బుమ్రా ఇలా తన ఆవేశాన్ని వెళ్లకక్కాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కరుణ్ నాయర్ చాలా కాలం తర్వాత IPL లో ఆడుతున్నాడు మరియు ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. అతను కేవలం 40 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అతను అవుట్ కావడంతో ఢిల్లీ ఓటమి పాలైంది.












Click it and Unblock the Notifications