IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు!
ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR) పరాజయాల పరంపర కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్‌తో గత మ్యాచ్‌లో వర్షంతో ఓటమి తప్పించుకున్న కేకేఆర్.. సొంతగడ్డపై మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. గురువారం కోల్‌కతా వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(LSG) 3 వికెట్ల తేడాతో కేకేఆర్‌ను ఓడించింది.
సునాయసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌ను కేకేఆర్.. చెత్త బౌలింగ్‌తో చేజార్చుకుంది. రూ.25.20 కోట్ల ఆటగాడైన కామెరూన్ గ్రీన్ పేలవ బౌలింగ్‌తో కేకేఆర్ విజయవకాశాలను దెబ్బతీయగా.. రూ.2.6 కోట్ల లక్నో యువ కెరటం ముకుల్ చౌదరి(27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 54 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. కీలకమైన 19వ ఓవర్ వేసిన కామెరూన్ గ్రీన్ రెండు సిక్స్‌లతో పాటు బౌండరీతో 16 పరుగులు సమర్పించుకొని కేకేఆర్ ఓటమికి కారణమయ్యాడు.

చెత్త బౌలింగ్‌తో..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే(24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), అంగ్‌క్రిష్ రఘువంశీ(33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) రాణించగా.. కామెరూన్ గ్రీన్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్), రోవ్‌మన్ పోవెల్(24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 నాటౌట్) పర్వాలేదనిపించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, సిద్దార్థ్, దిగ్వేష్ రతి, ఆవేష్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు
అనంతరం కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు చేసి గెలుపొందింది. ముకుల్ చౌదరితో పాటు ఆయుష్ బదోని(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీతో రాణించాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా(2/38), అనుకుల్ రాయ్(2/32) రెండేసి వికెట్లు తీయగా.. సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
మలుపు తిప్పిన ముకుల్ చౌదరి..
182 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఘోర ఓటమి దిశగా సాగింది. కానీ ఔటాఫ్ సిలబస్‌లా.. అంచనాల్లేకుండా బరిలోకి దిగిన ముకుల్ చౌదరీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 7 భారీ సిక్స్‌లు బాది అసాధ్యమనకున్న లక్నో విజయాన్ని సుసాధ్యం చేశాడు. అతనికి ఆవేష్ ఖాన్(1 నాటౌట్) అండగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో ముకుల్ చౌదరి టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారాడు.
చివరి 18 బంతుల్లో లక్నో విజయానికి 43 పరుగులు కావాల్సి రావడంతో కేకేఆర్ విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ ముకుల్ చౌదరీ అసాధారణ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. కార్తీక్ త్యాగి వేసిన 18వ ఓవర్‌లో రెండు సిక్స్‌లతో 13 పరుగులు పిండుకున్న ముకుల్.. కామెరూన్ గ్రీన్ వేసిన 19వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఒక బౌండరీతో 16 పరుగులు రాబట్టాడు.
దాంతో ఆఖరి ఓవర్‌లో లక్నో విజయానికి 14 పరుగులు అవసరం కాగా.. రెండో బంతిని సిక్సర్ బాదిన ముకుల్.. ఐదో బంతికి మరో సిక్స్ కొట్టి మ్యాచ్ డ్రా చేశాడు. ఆఖరి బంతిని కనెక్ట్ చేయడంలో విఫలమైనా.. క్విక్ సింగిల్ తీసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. 19వ ఓవర్‌లో కామెరూన్ గ్రీన్ ఒక్క సిక్స్ తక్కువ ఇచ్చినా కేకేఆర్ ఈ మ్యాచ్ గెలిచేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
-
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ టీమ్ మారబోతున్నాడా ? భారత మాజీ హింట్..! -
DC vs GT: ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందా ? ఆ రెండు బాల్స్ ..! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై..












Click it and Unblock the Notifications