Cameron Green కు బిగ్ షాక్..ఐపీఎల్ డబ్బులు సగానికి కట్..!!
IPL 2026 Auction: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఐపీఎల్ మినీ ఆక్షన్ ఆరంభమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబి వేదికగా రసవత్తరంగా సాగుతోందీ బిగ్ ఈవెంట్. రేపు కూడా కొనసాగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 2:30 గంటలకు అబుదాబిలోని ఎతిహాద్ అరేనాలో ప్రారంభమైంది. మొదట క్యాప్డ్, ఆ తర్వాత అన్ క్యాప్డ్ ప్లేయర్ల వేలం పాటను నిర్వహిస్తోన్నారు ప్రజెంటర్లు.
ఈ వేలంలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచాడు ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అతన్ని రూ. 25.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ బిడ్ అతన్ని ఐపీఎల్ కేరీర్ లోనే బిగ్గెస్ట్. ఈ సీజన్ లో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన ఓవర్సీస్ ఆటగాడయ్యాడు. రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ బ్రాకెట్ లో నిలిచిన కామెరాన్.. వేలంలోకి వచ్చిన వెంటనే ముంబై ఇండియన్స్ బిడ్ వేసింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ పోటీ పడింది. రూ. 2.80 కోట్లతో కేకేఆర్ బరిలోకి దిగడంతో కథ రసవత్తరంగా మారింది.

ఆ తర్వాత ముంబై ఇండియన్స్ డ్రాప్ అయినా రాజస్థాన్ రాయల్స్, కోల్ కత నైడ్ రైడర్స్ మధ్య పోటీ సుదీర్ఘంగా సాగింది. రూ. 13.60 కోట్ల వద్ద బిడ్డింగ్ నుంచి తప్పుకొంది రాజస్థాన్ రాయల్స్. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఈ బిడ్డింగ్ లోకి జాయిన్ అయింది. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ కూడా రూ. 25.20 కోట్ల వద్ద వెనక్కి తగ్గడంతో.. రికార్డు మొత్తానికి గ్రీన్‌ను దక్కించుకునే అవకాశం కోల్ కత నైట్ రైడర్స్ కు లభించింది.
రూ. 25.20 కోట్లకు కామెరాన్ గ్రీన్ అమ్ముడుపోయినప్పటికీ.. అతనికి దక్కే ఫీ మాత్రం 18 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 7.20 కోట్ల రూపాయలు కోత పడినట్టయింది. దీనికి కారణం లేకపోలేదు. ఈ సీజన్ లో భారత ఆటగాళ్ల విలువను కాపాడడానికి, అలాగే భారీ కాంట్రాక్టుల కోసం విదేశీ ఆటగాళ్లు వేచి ఉండకుండా నిరోధించడానికి బీసీసీఐ ఓ కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. విదేశీ ఆటగాళ్లు మినివేలంలో అమ్ముడుపోయే మొత్తానికి శ్లాబ్ విధించింది.
ఈ మాగ్జిమమ్ ఓవర్సీస్ ప్లేయర్ ఫీ నిబంధన కింద ఏ విదేశీ ప్లేయర్ అయినా సరే ఎంత మొత్తానికి బిడ్డింగ్ లో అమ్ముడుపోయినప్పటికీ.. గరిష్టంగా అతనికి దక్కేది 18 కోట్ల రూపాయలు మాత్రమే. అలాగని ఆ మిగిలిన మొత్తం ఆ ఫ్రాంఛైజీకి దక్కదు. అదంతా కూడా బీసీసీఐ ట్రెజరీకి చేరుతుంది. దీన్ని ఆటగాళ్ల సంక్షేమానికి వినియోగిస్తుంది.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications