SRH టీంలో వాళ్లుంటే మేం మ్యాచ్ ఆడం

సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అంటే చాలు మిగిలిన ఐపీఎల్ టీంలు అన్నీ కూడా తెగ భయపడిపోతున్నాయి. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంతో మ్యాచ్ అంటే తమకు రెండు పాయింట్లు చేరినట్టే అని భావించేవారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం సన్ రైజర్స్ హైదరాబాద్ టీంపై సెటైర్లు వేశారు. జైలర్ సినిమా ఆడియో ఫంక్షన్ సమయంలో రజనీకాంత్ మాట్లాడుతూ..సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచులు ఆడుతున్న సమయంలో ఆ టీం ఓనర్ కావ్య మారన్ ఫేస్ చూడలేకపోతున్నామని, కొంచెం మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయడంటూ కావ్య మారన్ తండ్రి కలానిథి మారన్‌కు రజనీకాంత్ సూచించారు.

ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, సన్ రైజర్స్ టీం అంటే మిగిలిన టీంలు భయపడిపోతున్నారు. విధ్వంసకర బ్యాట్స్‌మెన్లు ఆ టీంలో ఉన్నారు. అభిషేక్ శర్మ, హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి,హెన్రిచ్ క్లాసెన్ వంటి అరవీర భయంకరమైన బ్యాట్స్‌మెన్లు జట్టులో చేరారు. గతేడాది జరిగిన ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ను నెలకొల్పిన జట్టుగా సన్ రైజర్స్ నిలిచింది.పటిష్టమైన జట్లను ఓడించి ఫైనల్‌కు చేరిన ఆ జట్టు , తృటిలో కప్‌ను చేజార్చుకుంది. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి మళ్లీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.ఏడాది మారినా ఆ జట్టు తీరు మాత్రం మారలేదు. మరింత బలంగా సన్ రైజర్స్ జట్టు కనిపిస్తోంది.

campaign on social media in support of the Sunrisers Hyderabad team

సన్ రైజర్స్ టీం బ్యాట్స్‌మెన్లు ఒకటే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నారు. బంతి పడగానే అది సిక్స్ లేదా ఫోర్ అనే మాదిరిగా వారి క్రికెట్ సాగుతోంది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోర్‌ను నమోదు చేశారు. ఉన్నోళ్లు చాలదన్నట్టు ఈ టీంలోకి మరో విధ్వంసకర బ్యాట్స్‌మెన్ వచ్చి చేరాడు.టీమిండియా ఓపెనర్ ఇషాంత్ కిషాన్‌ను సన్ రైజర్స్ తన టీంలోకి తీసుకుంది.సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టాడు. ఇలా భయంకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అంటే మిగిలిన జట్లు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది.

Take a Poll

ఈ రోజు(గురువారం) లక్నో సూపర్ జెయింట్స్ టీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సన్ రైజర్స్ టీంకు మద్దతుగా పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. అభిషేక్ శర్మ, హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి,హెన్రిచ్ క్లాసెన్, ఇషాంత్ కిషాన్‌ ఉంటే మేం మ్యాచ్ ఆడమని , మిగిలిన జట్లు అంటున్నట్టుగా ఓ నెటిజన్ మీమ్ పోస్ట్ చేశాడు. కాటేరమ్మ కొడుకులను అడ్డుకోవడం ఎవరితరం కాదంటూ మరో నెటిజన్ పోస్ట్ చేశాడు. ఇలా సోషల్ మీడియాలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు మద్దతుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం లభిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+