యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో కార్లోస్ అల్కరాజ్ సంచలనం

US Open 2025: స్పెయిన్ టెన్నిస్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో తన అద్భుత ప్రతిభను చాటుకున్నాడు. ఫైనల్‌లో తన చిరకాల ప్రత్యర్థి యానిక్ సిన్నర్‌ను ఓడించి ఆరో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ హోరాహోరీ పోరులో అల్కరాజ్ 6-2, 3-6, 6-1, 6-4 తేడా యానిక్ సిన్నర్‌ను మట్టికరిపించాడు. ఈ విజయంతో కార్లోస్ అల్కరాజ్ రెండోసారి యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా నిలిచాడు.

హోరాహోరీగా సాగిన పోరు
కార్లోస్ అల్కరాజ్, యానిక్ సిన్నర్ మధ్య ఈ పోరు అభిమానులను ఆద్యంతం అలరించింది. నాలుగు సెట్ల పాటు ఉత్కంఠగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ విజయంతో అల్కరాజ్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంకింగ్‌ను తిరిగి దక్కించుకున్నాడు. సెప్టెంబర్ 2023 తర్వాత అల్కరాజ్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకోవడం ఇదే మొదటిసారి. ఈ ఓటమితో హార్డ్ కోర్టు గ్రాండ్ స్లామ్‌లలో సిన్నర్ 27 వరుస విజయాల పరంపర కూడా ముగిసింది. అల్కరాజ్ చేతిలో సిన్నర్ ఓడిపోవడం ఇది రెండో గ్రాండ్ స్లామ్ ఫైనల్. గ్రాండ్ స్లామ్ టైటిళ్ల విషయంలో కూడా యానిక్ సిన్నర్(4) కంటే అల్కరాజ్ ముందున్నాడు.

Carlos Alcaraz Wins 2025 US Open Final Against Jannik Sinner Sixth Grand Slam Victory

విజేతగా నిలిచిన అల్కరాజ్
ఫైనల్ మ్యాచ్ లో అల్కరాజ్ మొదటి గేమ్‌లోనే సిన్నర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి మొదటి సెట్‌ను సులభంగా గెలుచుకున్నాడు. అయితే రెండో సెట్ లో యానిక్ సిన్నర్ పుంజుకొని అల్కరాజ్ సర్వీస్ ను బలహీనపరిచి 3-1 ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత సిన్నర్ రెండో సెట్ గెలిచి మ్యాచ్ ను సమం చేశాడు. అయితే మూడో సెట్‌లో అల్కరాజ్ మళ్లీ ఆధిపత్యం చెలాయించాడు. అతను బేస్‌లైన్ స్మాష్ తో అద్భుతంగా ఆడి 3-0 ఆధిక్యంలోకి వెళ్లాడు. అల్కరాజ్ తన విజయాన్ని కొనసాగిస్తూ మూడో సెట్‌ను కూడా సులభంగా గెలుచుకున్నాడు. నాలుగో సెట్‌లో కూడా అల్కరాజ్ తన పట్టును కోల్పోలేదు. ఈ స్పెయిన్ ఛాంపియన్ ఐదో గేమ్‌లో సిన్నర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తన ఆధిక్యాన్ని కొనసాగించాడు. ఈ విజయంతో అల్కరాజ్ హార్డ్ కోర్ట్, గ్రాస్, క్లే కోర్టులలో అనేక ప్రధాన టైటిళ్లను గెలుచుకున్న చరిత్రలో నాలుగో ఆటగాడిగా నిలిచాడు.

అల్కరాజ్‌కు మరో రికార్డు
ఈ సంచలన విజయంతో కార్లోస్ అల్కరాజ్ హార్డ్ కోర్ట్, గ్రాస్, క్లే కోర్టులలో అనేక ప్రధాన టైటిళ్లను గెలుచుకున్న చరిత్రలో నాలుగో ఆటగాడిగా నిలిచాడు. గతంలో రోజర్ ఫెదరర్ మాత్రమే 2004 నుంచి 2008 వరకు యూఎస్ ఓపెన్ టైటిల్‌ను వరుసగా ఐదు సార్లు గెలుచుకుని రికార్డు సృష్టించాడు. ఈ సారి గతంలో విజేతగా నిలిచిన సిన్నర్ తన టైటిల్ నిలుపుకోవడంలో విఫలమయ్యాడు.

ప్రత్యేక ఆకర్షణగా డొనాల్డ్ ట్రంప్
ఫైనల్ కు మ్యాచ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2000లో బిల్ క్లింటన్ తర్వాత అమెరికా ప్రెసిడెంట్ ఈ టోర్నమెంట్ కు రావడం ఇదే మొదటిసారి. ప్రెసిడెంట్ రాక నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేశారు. ఈ భద్రతా చర్యల వల్ల వేలాది మంది అభిమానులు బయటే నిలిచిపోవడంతో మ్యాచ్ దాదాపు అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+