సేనా.. సిద్ధమా: అసలే పాకిస్తాన్: కౌంట్ డౌన్ స్టార్ట్
Rohit Sharma: ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు గడువు సమీపిస్తోంది. ఫిబ్రవరి 19వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. మార్చి 9వ తేదీ వరకు కొనసాగుతుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దేశం పాకిస్తాన్‌ను తలపడనుంది న్యూజిలాండ్. మార్చి 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
భారత్ సహా ఎనిమిది దేశాలు- పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఇందులో తలపడనున్నాయి. భారత్ ఆడబోయే మ్యాచ్‌లన్నీ కూడా తటస్థ వేదిక దుబాయ్‌లో జరుగనున్నాయి. మిగిలినవి- కరాచీ, లాహోర్, రావల్పిండిల్లో షెడ్యూల్ అయ్యాయి.

గ్రూప్-ఏలో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్.. గ్రూప్ బీలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఒక్క పాకిస్తాన్ మినహా మిగిలిన అన్ని దేశాల బోర్డులు కూడా తమ జట్లను ప్రకటించాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే భారత జట్టును బీసీసీఐ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. మొత్తం 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టు ఇది. రోహిత్ శర్మ కేప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ వైస్ కేప్టెన్‌గా అపాయింట్ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్లేయర్లు నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాగా- ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే జట్ల కేప్టెన్ల జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్, ఫొటో షూట్‌లో పాల్గొనడానికి పాకిస్తాన్‌కు వెళ్లకూడదని తాజాగా రోహిత్ శర్మ నిర్ణయించాడు. భారత్- పాకిస్తాన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అతను ఈ నిర్ణయిం తీసుకున్నాడు.
ఈ కారణంతోనే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటానికి తన జట్టును పాకిస్తాన్‌కు పంపించడానికీ అంగీకరించలేదు కేంద్ర ప్రభుత్వం. ఫలితంగా హైబ్రిడ్ మోడల్‌లో మ్యాచ్‌లను ఆడుతుంది టీమిండియా. అవన్నీ కూడా దుబాయ్‌తో జరుగనున్నాయి. ఫిబ్రవరి 20వ తేదీన తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది రోహిత్ సేన.
ఆ తరువాతి మ్యాచ్ పాకిస్తాన్‌తో. 23వ తేదీన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు గడువు సరిగ్గా నెల రోజులే ఉంది. వచ్చే 23వ తేదీ మధ్యాహ్నానికి క్రికెట్ ప్రేమికులందరూ టీవీలకు అతుక్కుపోవడం ఖాయం.
ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే జట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కేప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజాకు చోటు దక్కింది.












Click it and Unblock the Notifications