హార్దిక్ పాండ్యాకు షాకిచ్చిన హీరోయిన్

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యా ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత హార్దిక్ పాండ్యా పేరు మార్మోగిపోయింది. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి, కప్ గెలవడంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. ఇదే సమయంలో వ్యక్తిగతంగా కూడా హార్దిక్ పాండ్యా వార్తల్లో నిలిచారు. భార్య నటాషాతో హార్దిక్ విడిపోయారు. ఆమెకు విడాకులు ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న హార్దిక్, ఆ తర్వాత భార్య నటాషాతో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఆమెకు విడాకులిచ్చాడు.

కొడుకుతో కలిసి నటాషా తన సొంత దేశం అయిన స్వీడన్‌కు వెళ్లిపోయారు. భార్యతో విడాకులు అనంతరం హార్దిక్ , బాలీవుడ్ హీరోయిన్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే, హార్దిక్ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరు కలిసి అంబానీ పెళ్లిలో సందడి చేశారు. హిందీ పాటలకు ఇద్దరు కలిసి చిందులు వేసిన వీడియోలు సోషల్ మీడియిలో తెగ వైరల్ అయ్యాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో వీరిద్దరు ఒకర్ని ఒకరు ఫాలో అవుతున్నారు.

Cricketer Shubman Gill is dating Ananya Panday

దీంతో అనన్య పాండే, హార్దిక్‌లు రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. అంబానీ పెళ్లి తర్వాత వీరిద్దరు తరుచుగా కలుసుకుంటున్నారని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటు హార్దిక్ భార్యకు విడాకులు ఇవ్వడం, అటు అనన్య పాండే పలువురు హీరోలకు బ్రేకప్ చెప్పి సింగిల్‌గా ఉండటంతో వీరిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అనన్య పాండే గతంలో ఇషాన్ ఖత్తర్, కార్తిక్ ఆర్యన్, ఆదిత్యరాయ్ కపూర్‌తో డేటింగ్ చేసింది. రీసెంట్‌గానే ఆదిత్యరాయ్ కపూర్‌కు బ్రేకప్ చెప్పింది ఈ బ్యూటీ. దీంతో అనన్య పాండే, హార్దిక్‌ పాండ్యా రిలేషన్‌‌లో ఉన్నారని అంతా భావించారు.

అయితే హార్దిక్ పాండ్యాకు షాకిస్తూ..అనన్య పాండే మరో క్రికెటర్‌తో ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. అనన్య పాండే స్టార్ క్రికెటర్‌ శుభమన్ గిల్‌తో ఎఫైర్ ఉందని రూమర్ల చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరు చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నట్టు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.అనన్య పాండే, శుభ్‌మన్ గిల్ కలిసి కొన్ని రోజుల క్రితం ఒక ప్రకటన చేశారు. దీంతో అప్పటి నుంచే వీరిద్దరు ప్రేమలో ఉన్నారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. అప్పటి నుంచి వీరిద్దరు పార్టీలు, పబ్‌లకు తిరుగుతున్నారని తెలుస్తోంది. అటు శుభ్‌మన్ గిల్ సైతం పలువురు బాలీవుడ్ భామలతో ఎఫైర్ సాగించాడు. సచిన్ కూతురు సారా టెండుల్కర్‌, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్‌తో శుభ్‌మన్ గిల్ డేటింగ్ చేశాడు. ఇప్పుడు కొత్తగా అనన్య పాండేతో ప్రేమయాణం మొదలుపెట్టాడు. మరి వీరి బంధం ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+