అరంగేట్రంలోనే అదరగొట్టిన 17 ఏళ్ల సీఎస్‌కే చిచ్చరపిడుగు: ఫియర్‌లెస్
Ayush Mhatre: ఆయుష్ మాత్రే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అందించిన మరో స్టార్ క్రికెటర్. వయస్సు 17 సంవత్సరాలే. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. బలమైన ముంబై ఇండియన్స్ బౌలింగ్‌ను తుత్తునీయలు చేశాడు. భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖెడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తడబడుతోంది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సూపర్ కింగ్స్ 15 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా- 23, శివం దుబే- 37 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

ఇన్నింగ్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది చెన్నై. జట్టు స్కోరు 16 పరుగుల వద్ద ఉన్నప్పుడు రచిన్ రవీంద్ర అవుట్ అయ్యాడు. నాలుగో ఓవర్ తొలి బంతికి అశ్విని కుమార్ అతన్ని బలి తీసుకున్నాడు. ఆఫ్ స్టంప్‌కు కాస్త దూరంగా వేసిన క్రాస్ సీమ్ లెంగ్తీ డెలివరీని స్వీప్ షాట్ ఆడబోయాడు రచిన్. ఊహించిన దానికంటే ఎత్తుకు లేచిన బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ రియాన్ రికెల్టన్ చేతుల్లో వాలింది.
గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిల్చోలేకపోయాడు. స్టంపవుట్ అయ్యాడు. మిఛెల్ శాంట్నర్ వేసిన బంతిని ఫ్రంట్ ఫుట్ ఆడటానికి ప్రయత్నించాడు. కవర్స్ దిశగా షాట్ ఆడబోయాడు. బ్యాలెన్స్ తప్పాడు. క్రీజ్‌లోకి చేరుకోముందే రికెల్టన్ బెయిల్స్ ఎగురగొట్టాడు.
వన్‌డౌన్‌గా క్రీజ్‌లోకి వచ్చిన ఆయుష్ మాత్రే బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. క్రికెటింగ్ షాట్లు ఆడాడు. అనుకున్నది అనుకున్నట్టుగా బంతితో బ్యాట్‌ను కనెక్ట్ చేయగలిగాడు. 15 బంతుల్లోనే 35 పరుగులు చేశాడంటే అతని బ్యాటింగ్ స్పీడ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో నాలుగు ఫోర్లు, రెండు భారీ సిక్సర్లు ఉన్నాయి.
చివరికి దీపక్ చాహర్ బౌలింగ్ అవుట్ అయ్యాడు. చాహర్ వేసిన గుడ్ లెంగ్త్ లెగ్ కట్టర్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయాడు మాత్రే. హుక్ షాట్ ఆడాడు. లాంగాన్ దిశగా గాల్లోకి లేచిన బంతిని శాంట్నర్ అద్భుతంగా అందుకున్నాడు. దీనితో అతని సునామీ ఇన్నింగ్‌కు తెర పడింది. 213.33 స్ట్రైక్ రేట్‌తో ఐపీఎల్‌లో డ్రీమ్ డెబ్యూ ఇవ్వగలిగాడు మాత్రే.












Click it and Unblock the Notifications