మూలాలు మరిచిపోని కేశవ్ ఆత్మానంద్ మహరాజ్..!!

సిమ్లా: ఐసీసీ ప్రపంచకప్ 2023లో మరో సంచలనం. మొన్నటికి మొన్న పసికూన ఆఫ్ఘనిస్తాన్.. ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. డిపెండింగ్ చాంపియన్‌పై తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఆఫ్ఘన్ల చేతిలో ఏకంగా 69 పరుగుల తేడాతో దారుణ పరాజయాన్ని చవి చూసింది ఇంగ్లీష్ టీమ్. ఈ ఒక్క విజయం- ఆఫ్ఘనిస్తాన్‌ను పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేర్చింది.

ఆ మ్యాచ్ తాలూకు ప్రకంపనలు తగ్గకముందే అలాంటి విజయమే మరొకటి. ఈ సారి వంతు నెదర్లాండ్స్‌ది. వరుసగా తిరుగులేని విజయాలతో దూసుకెళ్తోన్న దక్షిణాఫ్రికన్లకు చుక్కలు చూపించింది డచ్ టీమ్. వర్షం వల్ల ఓవర్లను కుదించిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 38 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది.

CWC 2023, SA vs NED: Om sign was spotted in Keshav Maharajs bat

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్.. 43 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. వరుసగా వికెట్లను కోల్పోతోన్న దశలో బ్యాటింగ్‌కు దిగిన స్కాట్ ఎడ్వర్డ్స్ 78 పరుగులతో కేప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. నాటౌట్‌గా నిలిచాడు.

ఛేజింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఈ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. 207 పరుగులకే చతికిల పడింది. ఈ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్- 43, స్పిన్ బౌలర్ కేశవ్ మహరాజ్- 40 పరుగులతో రాణించారు. మిగిలిన బ్యాటర్లందరూ విఫలం అయ్యారు. హెన్రిచ్ క్లాసెన్- 29, గెరాల్డ్ కోయెట్జె- 22, క్వింటన్ డికాక్- 20 పరుగులు చేశారు.


ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కేశవ్ మహరాజ్ బ్యాట్‌పై ఓం అనే స్టిక్కర్ దర్శనం ఇచ్చింది. అతను క్రీజ్‌లో ఉన్నప్పుడు ఈ స్టిక్కర్‌లో అందరి దృష్టినీ ఆకట్టుకుంది. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కూడా పదే పదే ఆకాశం వైపు చూస్తూ భగవంతుడిని ప్రార్థించడం కనిపించింది.

కేశవ్ మహరాజ్ పూర్తి పేరు కేశవ్ ఆత్మానంద్ మహరాజ్. అతని పూర్వీకులు భారతీయులే. దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డారు. 1990 ఫిబ్రవరి 7వ తేదీన డర్బన్‌లోని నాటల్‌లో జన్మించాడు కేశవ్. అతని కుటుంబం హిందూమతాన్ని అనుసరిస్తోంది. అందుకే- తన మూలాలను మర్చిపోలేదు కేశవ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+