పాకిస్తాన్ సూపర్ లీగ్ వద్దు మొర్రో: మరో కీ ప్లేయర్ గుడ్ బై: ఐపీఎల్ లో రీప్లేస్

పాకిస్తాన్ సూపర్ లీగ్ కు మరో కీలక ఆటగాడు దూరం అయ్యాడు. ఐపీఎల్ లో ఆడనున్నాడు. గాయం కారణంగా తప్పుకొన్న సామ్ కరన్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ అతన్ని తీసుకోబోతోంది. అతనితో కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం దాదాపుగా ఖాయమైంది. దీంతో- పాకిస్తాన్ సూపర్ లీగ్ నుండి అర్ధాంతరంగా తప్పుకొన్న మరో ప్లేయర్ కానున్నాడు. తొలుత జింబాబ్వేకు చెందిన బ్లెస్సింగ్ ముజరబానీ పీఎస్ఎల్ తో కాంట్రాక్ట్ తెంచుకున్నాడు.

ఆ ప్లేయర్ మరెవరో కాదు- శ్రీలంకకు చెందిన డాసన్ షనక. పీఎస్ఎల్ నుండి ఐపీఎల్ కు మారనున్నాడు. గాయం కారణంగా తప్పుకొన్న సామ్ కరన్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ అతన్ని తీసుకోబోతోంది. రాజస్థాన్ రాయల్స్ ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించినట్లు క్రిక్ బజ్ తెలిపింది. డాసన్ షనకను జట్టులోకి తీసుకోబోతున్నామని ఫ్రాంచైజీ ప్రతినిధి నిర్ధారించినట్లు తెలిపింది. కొన్ని లాంఛనాలు మిగిలి ఉన్నాయని, శ్రీలంక క్రికెట్ కు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను పూర్తి చేయాల్సి ఉందని అన్నారు.

Dasun Shanaka Set to Join Rajasthan Royals for IPL as Sam Curran Replacement From Pakistan League

గత ఏడాది డిసెంబర్‌లో అబుదాబిలో జరిగిన మినీ వేలంలో షనక అన్‌సోల్డ్ అయ్యాడు. అతన్ని ఏ ఐపీఎల్ ఫ్రాంఛైజీ కూడా తీసుకోలేదు. ఆ తర్వాత పీఎస్ఎల్ వేలంలో పాల్గొన్నాడు. లాహోర్ ఖలందర్స్ అతన్ని 75 లక్షల పాకిస్తాన్ కరెన్సీకి కొనుగోలు చేసింది. అదే సమయంలో అనూహ్యంగా ఐపీఎల్ లో అడుగు పెట్టాల్సి వచ్చిందతనికి.

పీఎస్ఎల్ నుండి ఐపీఎల్ కు మారిన రెండో ఆటగాడు షనక. జింబాబ్వే ప్లేయర్ బ్లెస్సింగ్ ముజరబానీ గతంలో ఇస్లామాబాద్ యునైటెడ్ ఒప్పందం రద్దు చేసుకొని కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానంలో అతడిని తీసుకుంది కోల్ కత నైట్ రైడర్స్. అంతకుముందు సౌతాఫ్రికా ప్లేయర్ కార్బిన్ బోష్‌ కూడా పీఎస్ఎల్ కు గుడ్ బై చెప్పాడు. గత సంవత్సరం పెషావర్ జల్మీ ఆఫర్‌ను తిరస్కరించిన అతను ముంబై ఇండియన్స్‌లో చేరాడు. దీంతో పీఎస్ఎల్ అతనిపై చర్యలు తీసుకుంది. బోష్‌ను సంవత్సరం పాటు నిషేధించింది.

రాజస్థాన్ రాయల్స్ షనకను ఎంపిక చేయడం పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించదు. ఆ జట్టు హెడ్ కోచ్ కుమార్ సంగక్కర దీని వెనుక ఉన్నట్లు చెబుతున్నారు. అసిస్టెంట్ కోచ్ విక్రమ్ రాథోర్ గత టీ20 ప్రపంచ కప్‌లో శ్రీలంకకు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నారు. ఆ టోర్నమెంట్‌లో షనక జట్టు కెప్టెన్. శ్రీలంక సెమీస్‌కు రాలేకపోయినా, రెండు అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+