చాహల్‌తో డేటింగ్.. శుభ్‌మన్ గిల్‌తో లవ్!.. వీడియో వైరల్

RJ Mahvash: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయం వివిధ కారణాల వల్ల చిరస్మరణీయంగా మారింది. దశాబ్ధ కాలం తర్వాత భారత్ ఐసీసీ ట్రోఫీని గెలుచుకున్న గొప్ప క్షణం. అంతే కాకుండా చివరి ఓవర్లలో భారత క్రికెటర్ల ప్రదర్శన అభిమానులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. భారత్, న్యూజిలాండ్ జట్ల జరిన ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్ మ్యాచ్ ను భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఆర్జే మహవాష్ తో కలిసి వీక్షించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఆ వీడియోలో వీరిద్దరు చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపించారు. ఈ క్రమంలో చాహల్, ఆర్జే మహవాష్ ల మధ్య ప్రేమాయణం అంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. అప్పటి నుంచి వీరిద్దరు వార్తల్లో నిలిచారు. ఈ పుకార్లు రావడం ఇదే మొదటిసారి కాదు.. చాహల్, ధనశ్రీ విడాకుల కేసు కోర్టులో నడుస్తున్నప్పుడు కూడా ముంబైలో ఒక పార్టీ తర్వాత వారిద్దరూ కనిపించారు. అయితే ఆర్జే మహవాష్ సోషల్ మీడియాలో వివరణ ఇవ్వడం ద్వారా దీనిని ఖండించారు.

Dating with Chahal and Love with Shubman Gill RJ Mahvash s Viral Video Sparks Rumors

ఇదిలా ఉండగా.. ఆర్జే మహవాష్ పాత రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆర్జే మహవాష్.. క్రికెటర్ శుభ్‌మన్ గిల్ పట్ల తనకున్న వన్ సైడ్ లవ్ గురించి చెబుతోంది. ఆ వీడియోలో ఆర్జే మహవాష్ శుభ్‌మన్ గిల్ ను కలుసుకున్న తర్వాత తన వన్ సైడ్ లవ్ ను శాశ్వత బంధంగా మార్చుకునేందుకు నిమ్మకాయలతో చేతబడి లాంటి పూజలు చేస్తున్నట్లు కనిపించింది. ఇది సరదా ఫన్ రీల్ అయినప్పటికీ.. గిల్ తో ఆర్జే మహవాష్ ప్రేమలో ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతూ పుకార్లు పుట్టుస్తున్నారు. ఆమె యుజ్వేంద్ర చాహల్ తో డేటింగ్ వార్తలు వచ్చిన నేపథ్యంలో.. మహవాష్ పాత వీడియో మరోసారి వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+