కోహ్లీ ఆ హీరోయిన్‌ను ప్రేమించాడా..?

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సినీ-క్రీడా రంగాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన జంటలలో విరాట్ కోహ్లీ ,అనుష్క శర్మ కూడా ఒకరు. విరాట్ కోహ్లీ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరైతే, అనుష్క శర్మ బాలీవుడ్‌లో ప్రముఖ నటి. వీరిద్దరి కలయిక సినీ-క్రీడా ప్రేమికులను ఒకే చోట చేర్చింది. ఆ యాడ్ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచియం ప్రేమగా మారింది.

కొన్నాళ్లు రిలేషన్‌లో వీరిద్దరు తర్వాత తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నారు. కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత, 2017లో ఇటలీలో సైలెంట్‌గా వివాహం చేసుకున్నారు. విరాట్,అనుష్క దంపతులకు కూతురు , కుమారుడు ఉన్నారు. ఇదిలా ఉంటే కోహ్లీ గురించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. కోహ్లీ గతంలో ఓ హీరోయిన్‌తో రిలేషన్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది. ముఖ్యంగా బ్రెజిలియన్ మోడల్ ఇసబెల్ లియిట్‌తో విరాట్ కోహ్లీ సంబంధం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీళ్లిద్దరూ 2012లో సింగపూర్ లోని ఓ షాపింగ్ మాల్‌లో కలుసుకున్నారు.

Did Kohli love that heroine before Anushka Sharma

ఆ తర్వాత వీరిద్దరూ కొంతకాలం డేటింగ్ చేశారని, అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయారు. అలాగే, 2007లో మిస్ ఇండియా యూనివర్స్ విజేత అయిన సారహ్ జేన్ డయాస్ తో కూడా విరాట్ కోహ్లీ కొంతకాలం డేటింగ్ చేశాడు. వీళ్లిద్దరూ చాలాసార్లు పబ్లిక్ లో కూడా కనిపించారు. కానీ, వీళ్లిద్దరూ తమ ప్రేమాయణం గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు.హీరోయిన్ తమన్నాతో కూడా కోహ్లీ రిలేషన్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది. తమన్నా, కోహ్లీ ఇద్దరు కలిసి ఓ యాడ్ షూటింగ్ చేశారు. ఆ సమయంలో వీరు ప్రేమలో ఉన్నారనే రూమర్ వైరల్ అయింది.అయితే ఇవన్నీ కేవలం ప్రచారాలకే మాత్రమే పరిమితం అయ్యాయి.చివరకు కోహ్లీ తాను ప్రేమించిన అనుష్క శర్మనే వివాహం చేసుకుని వైవాహిక జీవితాన్ని సాఫీగా సాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+