వరల్డ్ నం.1 సబలెంకకు షాక్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా రిబాకినా!
Australian Open 2026: టెన్నిస్ ప్రపంచంలో నయా క్వీన్ ఉద్భవించింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ ఫైనల్లో కజకిస్థాన్ టెన్నిస్ స్టార్ ఎలెనా రిబాకినా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. రోడ్ లేవర్ ఎరీనాలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ ఎరీనా సబలెంకను మట్టికరిపించి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో రిబాకినా తన కెరీర్‌లో రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను ముద్దాడడమే కాకుండా.. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తొలి కజకిస్థాన్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది.
2023 ఓటమికి బదులు ప్రతీకారం
ఈ విజయం రిబాకినాకు కేవలం ఒక టైటిల్ మాత్రమే కాదు.. ఒక మధురమైన ప్రతీకారం కూడా. సరిగ్గా 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో ఇదే సబలెంక చేతిలో రిబాకినా పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. సరిగ్గా మూడేళ్ల తర్వాత మళ్లీ అదే వేదికపై, అదే ప్రత్యర్థిని ఎదుర్కొని, పాత బాకీని వడ్డీతో సహా చెల్లించింది. సబలెంక వరుసగా మూడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలవాలన్న ఆశలపై రిబాకినా నీళ్లు చల్లింది.

నరాలు తెగే ఉత్కంఠ.. 2 గంటల పైగా సాగిన పోరు
ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. సుమారు 2 గంటల 18 నిమిషాల పాటు సాగిన ఈ 'మారథాన్' పోరులో రిబాకినా 6-4, 4-6, 6-4 తేడాతో విజయం సాధించింది. తొలి సెట్‌ను రిబాకినా తన పవర్‌ఫుల్ సర్వీస్‌లతో కైవసం చేసుకోగా.. రెండో సెట్‌లో సబలెంక పుంజుకుని మ్యాచ్‌ను సమం చేసింది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో ఒక దశలో సబలెంక 3-0తో ఆధిక్యంలో ఉండి టైటిల్ వైపు దూసుకుపోతున్నట్లు కనిపించింది. కానీ రిబాకినా అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో పునరాగమనం చేసి వరుస పాయింట్లు సాధించి సబలెంకకు షాకిచ్చింది.
కాసుల వర్షం.. రికార్డు స్థాయి ప్రైజ్ మనీ
ఛాంపియన్‌గా నిలిచిన ఎలెనా రిబాకినాపై కాసుల వర్షం కురిసింది. ఆమెకు సుమారు 4.15 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల (దాదాపు రూ. 22.8 కోట్లు) ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్‌గా నిలిచిన ఎరీనా సబలెంకకు 2.15 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 11.8 కోట్లు) లభించాయి. 2022లో వింబుల్డన్ గెలిచిన రిబాకినాకు ఇది రెండో గ్రాండ్ స్లామ్ కాగా.. ఈ విజయంతో ఆమె ర్యాంకింగ్స్‌లో కూడా పురోగతిని సాధించనుంది.
ఆదివారం 'బిగ్ ఫైట్': జకోవిచ్ వర్సెస్ అల్కరాజ్
మహిళల సింగిల్స్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆదివారం జరగబోయే పురుషుల సింగిల్స్ ఫైనల్‌పై పడింది. టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్, యువ సంచలనం, ప్రపంచ నంబర్-1 కార్లోస్ అల్కరాజ్ మధ్య ఈ పోరు జరగనుంది. ఫిబ్రవరి 1, మధ్యాహ్నం 2:00 గంటలకు (IST) ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం క్రీడా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జకోవిచ్ తన 25వ గ్రాండ్ స్లామ్ రికార్డు కోసం వేచి చూస్తుంటే.. అల్కరాజ్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని పట్టుదలతో ఉన్నాడు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications