బెన్ స్టోక్స్ అవుట్- అదే దెబ్బేసింది: జట్టులో ఏకంగా 4 మార్పులు

Ben Stokes: అండర్సన్- టెండుల్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్.. తన చివరిదైన అయిదో మ్యాచ్ కోసం ప్రిపేర్ అవుతోంది. ఈ నెల 31వ తేదీన లండన్ కెన్నింగ్టన్ ఓవల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ మొదలవుతుంది. ఇందులో ఓడిపోతే సిరీస్ ను ఇంగ్లాండ్ కు ధారదాత్తం చేసినట్టవుతుంది టీమిండియాకు.

ఇప్పటివరకు జరిగిన నాలుగింట్లో ఇంగ్లాండ్ రెండింట్లో విజయం సాధించింది. 2-1 తేడాతో ఆధిక్యతను సాధించింది. మాంచెస్టర్ లో జరిగిన నాలుగో టెస్ట్ నాటకీయ పరిణామాల మధ్య డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. సిరీస్ ను సొంతం చేసుకోవడానికి ఇంగ్లాండ్, సమం చేయడానికి టీమిండియా శాయశక్తులా ప్రయత్నిస్తోన్నాయి. నెట్ ప్రాక్టీస్ లో నిమగ్నం అయ్యాయి.

England Playing 11 vs IND A major blow to England

ఈ పరిస్థితుల మధ్య టీమిండియాకు బ్యాడ్ న్యూస్ అందింది. సిరీస్ సమం కావాలంటే గెలిచి తీరాల్సిన అయిదో టెస్ట్ మ్యాచ్ కు స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా దూరం అయ్యాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ సలహా మేరకు అతనికి విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది.

బుమ్రా స్థానంలో పేసర్ ఆకాష్ దీప్ జట్టులోకి రానున్నాడు. తుదిజట్టులో అతనికి చోటు దక్కడం దాదాపుగా ఖాయమైంది. ఓవల్ స్టేడియంలో నెట్స్ లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు ఆకాష్ దీప్. బౌలింగ్ రిథమ్ ను అందిపుచ్చుకున్నాడు. వికెట్ల వద్ద ఖచ్చితమైన ప్లేస్ మెంట్ తో పదునైన బంతులను సంధించాడు.

రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆకాష్ దీప్ అదరగొట్టిన విషయం తెలిసిందే. రెండు ఇన్నింగ్స్ లల్లో 10 వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్ భారత్ వశం కావడంలో కీలకంగా మారాడు. తొలి ఇన్నింగ్ లో నాలుగు, రెండో ఇన్నింగ్ లో ఆరు వికెట్లు నేలకూల్చాడు. వెన్ను నొప్పి వల్ల అతను నాలుగో టెస్టుకు అందుబాటులో లేడు. అతని స్థానంలో అన్షుల్ కాంబోజ్ అరంగేట్రం చేశాడు.

ఇప్పుడు ఇదే పరిస్థితిని ఇంగ్లాండ్ కూడా ఎదుర్కొంటోంది. ఆ జట్టులో ఏకంగా నాలుగు భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బెన్ స్టోక్స్ తప్పుకొన్నాడు. అతనొక్కడే కాదు.. పేస్ బౌలర్ జోఫ్రా అర్చర్ సైతం జట్టు నుంచి వైదొలిగాడు. స్పిన్ బౌలర్ లియామ్ డాసన్, బ్రైడన్ కార్స్ పైనా వేటు పడింది.

స్టోక్స్ అందుబాటులో లేకపోవడం వల్ల ఒల్లె పోప్.. జట్టు కేప్టెన్ గా బాధ్యతలను చేపట్టాడు. జోఫ్రా అర్చర్, లియామ్ డాసన్, బ్రైడన్ కార్స్ స్థానంలో మరో నలుగురు ప్లేయర్లు జట్టులోకి వచ్చారు. జాకబ్ బేథెల్, జెమి ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోష్ టోంగ్ లకు తుదిజట్టులో చోటు దక్కింది.

కెప్టెన్ బెన్ స్టోక్స్ కుడి భుజం గాయం కారణంగా అందుబాటులో లేడు. జాకబ్ బెథెల్.. 6వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. సర్రే బౌలర్లు గస్ అట్కిన్సన్, జెమీ ఓవర్టన్ తో పాటు నాటింగ్‌ హామ్‌ షైర్ క్వెస్ట్ ప్లేయర్ జోష్ టంగ్‌తో పాటు జట్టులోకి తీసుకున్నామని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ తెలిపింది.

భారత్ తో అయిదో టెస్ట్ మ్యాచ్ ఆడే ఇంగ్లాండ్ తుదిజట్టులో- జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓల్లీ పోప్ (కేప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ ఆడనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+