దగ్గరుండి అస్సాం రైలెక్కించావ్ కదరా..!!

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా దారుణ పరాజయం పరిపూర్ణమైంది. ఇప్పటికే తొలి టెస్ట్ లో ఘోరంగా ఓడిపోయింది. ప్రత్యర్థి నిర్దేశించిన 124 పరుగులను కూడా అందుకోలేక చాపచుట్టేసింది. 93 పరుగులకే చతికిలపడింది. గువాహటిలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లోనూ అవే సన్నివేశాలు రిపీట్ అయ్యాయి. బౌలర్ల ధాటికి పూర్తిగా చేతులెత్తేసింది. 140 పరుగులకే ఆలౌట్ అయింది. ఏకంగా 408 పరుగుల తేడాతో మట్టికరిచింది.

ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా సరికొత్త చరిత్ర లిఖించింది. 2-0 తేడాతో భారత్ లో భారత్ ను ఓడించింది. 25 సంవత్సరాల నాటి రికార్డును తిరగరాసింది. అదే సమయంలో ఈ ఓటమితో భారత జట్టు ఓ చెత్త రికార్డును నెలకొల్పింది. 350 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడిపోవడం భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇప్పటివరకు టెస్ట్ మ్యాచ్ లల్లో ఓటమి ఎదురైనప్పటికీ.. ఇంత ఘోరంగా ఎప్పుడూ ఓడిపోలేదు.

Fans takes a dig at Gautam Gambhir

ఈ ఓటమి.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పై ట్రోల్స్ కు తెర తీసింది. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి మీద భారీగా ట్రోల్స్ పడుతున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్.. ప్లాట్ ఫామ్ పై అభిమానులు వీరిద్దరినీ ఎండగడుతున్నారు. టీమ్ సెలెక్షన్ పట్ల దుమ్మెత్తిపోస్తోన్నారు. ఏ ఒక్క ప్లేయర్ కూడా టెస్ట్ ఫార్మట్ ఆడటానికి అనర్హుడని తేల్చి చెబుతున్నారు. టీ20 ప్లేయర్లతో జట్టును నింపడమే దీనికి కారణమని మండిపడుతున్నారు. వీరితో పాటు జరెల్ వంటి ప్లేయర్లపైనా విరుచుకుపడుతన్నారు ఫ్యాన్స్.

సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి హేమాహేమీలు ఆడిన ఘనత ఉన్న టెస్ట్ జట్టులో జురెల్, సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఓపిక లేని ప్లేయర్లను ఎంపిక చేయడమే మొదటి తప్పుగా చెబుతున్నారు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్ లో అత్యంత కీలకంగా భావించే నంబర్ 4 స్థానంలో జురెల్ ను పంపించడాన్ని తప్పుపడుతున్నారు. జురెల్.. ఈ మ్యాచ్ లో రెండు పరుగులే చేశాడు. తొలి ఇన్నింగ్ లో డకౌట్ అయ్యాడు.

గౌతమ్ గంభీర్ పక్షపాతం చూపిస్తోన్నాడని, తనకు ఇష్టమైన ప్లేయర్లతో జట్టును నింపాడనీ అభిమానులు విమర్శిస్తోన్నారు. దూకుడు పేరుతో టెస్ట్ జట్టును నాశనం చేశాడనీ మండిపడుతున్నారు. టీ20 ప్లేయర్ల ఫార్మట్ లో ఆడేవారిని టెస్టుకు ఎంపిక చేసిన తర్వాత ఇంతకంటే మంచి ఫలితాలు రాబోవనీ చెబుతున్నారు. గంభీర్ కు హెడ్ కోచ్ గా కొనసాగే అర్హత లేదని, ఇప్పటికైనా టెస్ట్ ఫార్మట్ ప్లేయర్లు ఎవరో గుర్తించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+