జోస్ బట్లర్‌కు షాక్..హర్షిత్ రాణాకు మద్దతుగా ఇంగ్లాండ్ ప్లేయర్
కంకషన్ సబ్‌స్టిట్యూట్ విధానం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది.టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతన్న టీ20 సిరీస్‌లో ఈ వివాదం తలెత్తింది. టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. దీనిలో భాగంగానే మొదటి రెండు టీ20ల్లో టీమిండియా విజయం సాధించగా, మూడో టీ20లో ఇంగ్లాండ్ జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది. కీలకమైన నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది.దీంతో మరో టీ20 మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. పుణెలోని ఎంసీఏ స్టేడియంలో శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 180 పరుగులు చేసింది.
హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేల మెరుపు అర్ధ సెంచరీలతో ఇంగ్లండ్ కు 181 పరుగుల టార్గెట్ విధించింది. యితే బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో శివమ్ దూబే గాయపడ్డాడు. దీంతో అతని స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్ రాణాను భారత్ తీసుకుంది.ఇది అతనికి తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నహర్షిత్ రాణా మూడు వికెట్లను పడగొట్టాడు.తొలి ఓవర్ రెండో బంతికే లియామ్ లివింగ్‌స్టోన్ కీలక వికెట్ తీయడంతో మ్యాచ్ అక్కడి నుంచి మలుపు తిరిగింది.

హర్షిత్ రాణా కారణంగానే టీమిండియా విజాయాన్ని నమోదు చేసింది. అయితే హర్షిత్ రాణాను తీసుకోవడంపై ఇంగ్లాండ్ జట్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. మ్యాచ్ మధ్యలోనే అంపైర్లతో చర్చిస్తూ కనిపించాడు. హర్షిత్ రాణా ఎంపిక లైక్ టు రీప్లేస్ మెంట్ కాదని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అభిప్రాయపడ్డాడు.
దూబే ఆల్ రౌండర్ అయినప్పటికీ టీమిండియా ఇలా పర్ఫెక్ట్ బౌలర్‌ను ఎంపిక చేయడం సరైంది కాదని జోస్ బట్లర్ వాదిస్తున్నాడు.హర్షిత్ రాణా విషయంలో మ్యాచ్ రిఫరీ మరింత స్పష్టత ఉండాలని జోస్ బట్లర్ అభిప్రాయపడ్డాడు. దీంతో హర్షిత్ రాణాపై ఇంగ్లాండ్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. యితే తాజాగా ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ హర్షిత్ రాణాకు మద్దతుగా నిలిచారు.
ఈ విషయంలో హర్షిత్ రాణా తప్పులేదని కెవిన్ పీటర్సన్ చెప్పుకొచ్చాడు. జట్టు తీసుకున్న నిర్ణయం కారణంగానే హర్షిత్ రాణా మ్యాచ్‌లో స్థానం దక్కిందని, ఈ అవకాశం ఇచ్చిన జట్టే ఈ నిర్ణయం తీసుకుందని పీటర్సన్ స్టార్ స్పోర్ట్స్‌కు తెలిపాడు.ఈ వివాదాన్ని పక్కన పెడితే హర్షిత్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని, బౌండరీ లైన్స్‌కి అనుగుణంగా బౌలింగ్ మారుస్తూ, బ్యాట్స్‌మెన్‌ను చక్కగా చదివి బౌలింగ్ చేశాడు. మ్యాచ్‌ను గెలిపించేందుకు తన వంతు కృషి చేశాడని,హర్షిత్‌కు ఇది చక్కని అరంగేట్రమని పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు.












Click it and Unblock the Notifications