మరో స్టార్ క్రికెటర్ విడాకులు.. 14 ఏళ్ల బంధానికి గుడ్ బై

ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య అధికమవుతోంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. ఈ రోజున ఏ సెలబ్రిటీ విడాకులు ప్రకటిస్తారో అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.తాజాగా సినిమా వారికి ఏమాత్రం తీసిపోని విధంగా టీమిండియా క్రికెటర్లు సైతం విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది టీమిండియా క్రికెటర్లు , తమ భార్యలకు విడాకులు ఇచ్చారు.

కొంతమంది క్రికెటర్లు ఇదే బాటలో పయనిస్తున్నారు.టీమిండియా క్రికెటర్లు విడాకులు తీసుకుంటున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ వైవాహిక జీవితం గురించి గత కొద్దిరోజులుగా అనేక వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మరో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా తన వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పబోతున్నారంటూ ప్రచారం మొదలైంది.

Former South African star cricketer JP Duminy says goodbye to his married life

వీరిద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది. తాజాగా మరో క్రికెటర్ విడాకుల బాట పట్టారు.దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ జేపీ డుమిని తన వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పారు.తన భార్య స్యూ నుంచి విడాకులు తీసుకున్నట్టు జేపీ డుమిని ప్రకటించారు.14 ఏళ్ల వివాహ జీవితానికి వీడ్కోలు పలుకుతున్నట్టు డుమిని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.అన్నీ ఆలోచించిన తర్వాతే తామిద్దరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

వీరికి ఇద్దరు కుమార్తెలు.జేపీ డుమిని తన బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికా జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించాడు.టీ20 జట్టుకు డుమిని వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.డుమినీ తన సొంత జట్టు కేప్ కోబ్రాస్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడాడు. అలాగే క్రికెట్ ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ తీసిన తొలి దక్షిణాఫ్రికా ఆటగాడుగా చరిత్ర సృష్టించాడు, 2015 టోర్నమెంట్‌లో శ్రీలంకపై అతను ఈ ఘనత సాధించాడు. డుమిని ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్ వ్యాఖ్యాతగా పని చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+