ఆడపిల్ల అని చెత్త కుండీలో పడేశారు.. ఇప్పుడు ICC క్రికెటర్ ఆఫ్ ది ఇయర్..

ఆడపిల్ల అని చెత్తబుట్టలో పడేశారు తల్లిదండ్రులు. ఆ క్షణం వాళ్లకు భారం ఆ పసికందు. కానీ అదే పసి ప్రాణం మరో కుటుంబానికి వరంగా మారింది. తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు.. తల్లిదండ్రులు కని చెత్తబుట్టలో పడేస్తే.. ఓ అనాథ శరణాలయం పెంచింది. ఓ ఆస్ట్రేలియన్ కుటుంబం ఆమెను దత్తత తీసుకుంది. అక్కడే పెరిగి పెద్దదై క్రికెట్ లో రాణిస్తూ.. ఏకంగా ఆస్ట్రేలియన్ మహిళా క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికైంది. ICC క్రికెటర్ అవార్డునూ అందుకుంది. ఆమె సక్సెస్ జర్నీ మీకోసం..

ఆస్ట్రేలియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ లీసా స్తాలేకర్ ను మహారాష్ట్ర పుణెలోని శ్రీవాస్తవ అనాథ శరణాలయం వద్ద ఉన్న చెత్త కుండీలో దొరికింది. అనాథ శరణాలయంలోనే ఆమె పెరిగింది. ఆమెకు శరణాలయం సిబ్బంది లైలా అనే పేరును పెట్టారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆస్ట్రేలియా నుంచి హరెన్, స్యూ అనే భార్యాభర్తలు పుణెలోని ఈ అనాథ శరణాలయానికి వచ్చారు. వారు ఒక అబ్బాయిని దత్తత తీసుకోవడానికి వచ్చారు. అయితే అక్కడే ఉన్న లైలా.. ఆమె బ్రౌన్ కళ్లు,కల్మశం లేని ముఖం.. వాళ్లను ఆకర్షించింది. ఆ తర్వాత చట్టపరమైన విధివిధానాలు అన్ని పూర్తిచేసి.. ఆ దంపతులు లైలాను ఆస్ట్రేలియా తీసుకెళ్లారు.

From Trash Bin to Triumph The Inspiring Journey of ICC Cricketer of the Year

ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత లైలా పేరును లీసా అని మార్చారు తల్లిదండ్రులు. ఆ తర్వాత కొన్ని రోజులు ఆ కుటుంబం అమెరికాలో గడిపి.. ఆ తర్వాత ఆస్ట్రేలియాలోని సిడ్నీలో స్థిరపడింది. లీసా తన తండ్రి హరెన్ వద్ద క్రికెట్ నేర్చుకుంది. పార్కులో అబ్బాయిలతోనూ రోజూ క్రికెట్ ఆడుతూ ఉండేది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన తండ్రి హరెన్.. లీసాను ప్రోత్సహించాడు. దీంతో లీసా క్రికెట్ పై పూర్తిగా దృష్టి సారించింది. 1997లో లీసా తన మొదటి మ్యాచ్ సౌత్ వేల్స్ 2001 జట్టు తరఫున ఆడింది. ఆ తర్వాత 2003లో ఆస్ట్రేలియా తరఫున మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడింది. 2005లో మొదటి టీ20 ఆడింది. మొత్తం 8 టెస్టు మ్యాచ్ ల్లో 416 పరుగులు చేసింది. 125 వన్డేలు ఆడి 23 వికెట్లు పడగొట్టింది. 54 టీ20ల్లో 146 వికెట్లు రాబట్టింది. అదే టీ20ల్లో 769 పరుగులు, 60 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పింది.

1000 పరుగులు చేసిన మొదటి మహిళా క్రికెటర్ గా నిలిచింది లీసా. అంతేకాక 100 వికెట్లు తీసిన తొలి మహిళా బౌలర్ గానూ రికార్డు సృష్టించింది. ఆమె ప్రపంచంలోనే నెం.1 ఆల్ రౌండర్ గా, ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గానూ పేరు ప్రఖ్యాతలు సాధించింది.2013లో ఆమె అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికింది. ఐసీసీ ఆమెను హాల్ ఆఫ్ ఫేమ్ తో సత్కరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+