ఎగతాళి చేసినట్టు కాదురోయ్- మీ తోలు తీస్తారు.. రెడీగా ఉండండి

ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్తాన్ ప్లేయర్లు హ్యారిస్ రవూఫ్, సాహిబ్‌జాదా ఫర్హాన్ రెచ్చగొట్టేలా వ్యవహరించడాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. వారి చేష్టలపై టీమిండియా అధికారికంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసింది. దీన్ని ఐసీసీ స్వీకరించింది. తొలిదశలో రవూఫ్, ఫర్హాన్ ల నుంచి రాతపూర్వకంగా వివరణను కోరనుంది ఐసీసీ. సంతృప్తికర వివరణ ఇవ్వకపోతే ఐసీసీ తదుపరి చర్యలకు ఆదేశించే అవకాశం ఉంది. అప్పుడు ఐసీసీ ఎలైట్ ప్యానల్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ ముందు వారు హాజరుకావాల్సి ఉంటుంది.

ఈ నెల 21న జరిగిన మ్యాచ్‌లో హరీస్ రవూఫ్ చేష్టలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. స్టేడియంలో టీమిండియా అభిమానులు "కోహ్లీ, కోహ్లీ" అని నినాదాలు చేశారు. 2022 టీ20 ప్రపంచ కప్‌లో మెల్‌బోర్న్‌లో రవూఫ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన ఐకనిక్ సిక్స్‌ను గుర్తు తెచ్చుకున్నారు. దీనికి ప్రతిగా రవూఫ్.. వారిని కించపరిచేలా, మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించాడు. విమానం కూలిపోయినట్లు చేతులు ఊపాడు. పాకిస్తాన్ పై భారత సైనిక చర్యను ఎగతాళి చేశాడు.

Game On BCCI Move on Pakistan Cricketers at ICC

అంతేకాకుండా బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా భారత ఓపెనర్లు శుభమన్ గిల్, అభిషేక్ శర్మ పట్ల దుర్భాషలాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి ఆ ఇద్దరూ బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చారు. అతని ఓవర్ లో విరుచుకుపడ్డారు. భారీగా సిక్సర్లు, ఫోర్లతో చుక్కలు చూపించారు.

అదే మ్యాచ్‌లో సాహిబ్‌జాదా ఫర్హాన్ కూడా ఒక వివాదాస్పదంగా వ్యవహరించాడు. బ్యాట్‌ను మెషిన్ గన్‌లా పట్టుకుని, కాల్పులు జరిపినట్లు అనుకరించాడు. ఈ చేష్టలు కూడా తీవ్ర విమర్శలకు దారితీశాయి. తన చర్యలను ఫర్హాన్ సమర్థించుకున్నాడు. మ్యాచ్ తర్వాత అతను మాట్లాడాడు. సాధారణంగా హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత తాను పెద్దగా సెలబ్రేట్ చేసుకోనని, ఆ మ్యాచ్ లో చేసిన అర్ధసెంచరీని డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకోవాలన్నానని, అందుకే అలా చేశానని చెప్పాడు. ప్రజలు దీన్నిఎలా తీసుకుంటారనేది తనకు అనవసరమని చెప్పాడు.

ఈ రెండింటినీ బీసీసీఐ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఐసీసీకి ఫిర్యాదు చేసింది. వీటికి రవూఫ్, ఫర్హాన్ వివరణలను ఇవ్వాల్సి ఉంటుంది. సంతృప్తికర వివరణ ఇవ్వకపోతే ఎలైట్ ప్యానెల్ ముందు విచారణకు హాజరుకావొచ్చు. ఐసీసీ నియమావళి ప్రకారం వారికి శిక్షలు పడే అవకాశం ఉంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ క్రికెట్‌లో క్రీడాస్ఫూర్తిపై చర్చకు దారితీశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+