ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు
టీ20 వరల్డ్ కప్ ను భారత జట్టు చారిత్రాత్మక ఘట్టంతో ముగించింది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ లో న్యూజిలాండ్‌ను ఓడించింది. తిరుగులేని గెలుపుతో జగజ్జేతగా నిలిచింది. టీ20 ప్రపంచ కప్‌ను విజయవంతంగా కాపాడుకున్న తొలి జట్టుగా భారత్ నిలిచింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ అయిదు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
వరుస హాఫ్ సెంచరీలతో రాణించిన ఓపెనర్ సంజు శాంసన్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును గెలుచుకున్నాడు. నిజానికి- ఈ వరల్డ్ కప్‌లో సంజు శాంసన్‌కు మొదట్లో అవకాశాలు లభించలేదు కూడా. అతన్ని జట్టు నుండి తప్పించింది మేనేజ్మెంట్. బెంచ్ కే పరిమితం చేసింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్నాడు. అయిదు మ్యాచ్‌లలోనే 321 పరుగులు సాధించాడు. ఇందులో వరుసగా మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ మూడు కీలకమైన అర్ధ సెంచరీలు కూడా నాకౌట్ మ్యాచ్‌లలోనే వచ్చాయి.

భారత జట్టు సాధించిన ఈ విజయంపై అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ స్పందించారు. జట్టును అభినందించారు. టోర్నమెంట్ అసాంతం జట్టు కనబర్చిన అద్భుత ప్రదర్శన, కీలక ఆటగాళ్ల ప్రదర్శనను పొగడ్తల్లో ముంచెత్తారు. తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. అన్ బిలీవబుల్, అన్ స్టాపబుల్, అన్ బీటెన్ భారత్.. అంటూ జట్టును అభినందించారు గౌతమ్ అదాని. టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్లకు అభినందనలు పేర్కొన్నారు. న్యూజిలాండ్‌తో లెక్క సరిపోయిందని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు గౌతమ్ అదాని. ఈ మలయాళీ ఆటగాడిని ఆకాశానికెత్తేశారు. అతని బ్యాటింగ్ తీరు, నిలకడగా ఆడిన వైఖరిని కేరళలోని విజింజం పోర్ట్ లో గల ఓ భారీ క్రేన్ తో పోల్చారు. ఇంత నిలకడ, స్థిరత్వం విజింజం పోర్ట్ లో ఉండే క్రేన్ కు కూడా లేదని కితాబిచ్చారు. తిరువనంతపురం సమీపంలో ఉండే ఈ విజింజం పోర్ట్.. అదాని గ్రూప్ కు చెందినది.
Unbelievable. Unstoppable. UNBEATEN Bharat!!
— Gautam Adani (@gautam_adani) March 8, 2026
Congratulations on the T20 2026 World Cup Championship! 🏆🇮🇳
New Zealand का हिसाब-किताब बराबर!
Sanju Samson of Vizhinjam QF / SF / Final Scores: 97, 89, 89.
इतनी कंसिस्टेंसी तो Adani के Vizhinjam Port के क्रेन में भी नहीं होती!… pic.twitter.com/tmfMLX8Rdm
సంజు శాంసన్ విజింజం ఆఫ్ క్వార్టర్ ఫైనల్ / సెమీఫైనల్ / ఫైనల్ అని వ్యాఖ్యానించారు. సంజు శాంసన్ సాధించిన స్కోర్ ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. 97, 89, 89 పరుగులు చేశాడని గుర్తు చేశారు. అదానీ విజింజం పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఇంత స్థిరత్వం ఉండదని పేర్కొన్నారు. ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా గురించీ ప్రస్తావించారు. బ్యాట్స్‌మెన్‌లు అతన్ని ఎదుర్కొనేటప్పుడు దారి తప్పిపోతారని, ఈ అహ్మదాబాద్ ప్లేయర్, ప్రపంచంలోనే అత్యుత్తమం అని చెప్పారు. ట్రోఫీ మన ఇంటికొచ్చిందని అన్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications