అభిషేక్ శర్మకు ఇక తప్పదు

టీ20 వరల్డ్ కప్ లో భారత్ విజయాల పరంపరకు బ్రేక్ పడింది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం పాలైంది. 76 పరుగుల తేడాతో ఓటమి టోర్నమెంట్ చరిత్రలో భారత్‌కు అతిపెద్ద పరాజయం రికార్డును నమోదు చేసింది. ఈ ఓటమి తర్వాత టీమిండియా సెమీ ఫైనల్స్ అవకాశాలు దాదాపుగా సన్నగిల్లాయి. దాదాపు ద్వారాలు మూసుకుపోయాయి.

ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి విఫలం అయ్యాడు. లీగ్స్ లో వరుసగా హ్యాట్రిక్ డకౌట్ కొట్టిన ఈ డాషింగ్ బ్యాటర్.. ఈ మ్యాచ్ లో ఖాతా తెరిచాడు గానీ ఎక్కువ సేపు కుదురుగా క్రీజ్ లో నిల్చోలేకపోయాడు. 12 బంతులను ఎదుర్కొన్న అభిషేక్ ఒక సిక్స్, రెండు ఫోర్లతో 15 పరుగులు చేసి వెనుదిరిగాడు. మార్కొ జెన్ సెన్ బౌలింగ్ లో బోష్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అతను అవుట్ కావడంతో 26 పరుగులకే మూడు వికెట్లను కోల్సోవాల్సి వచ్చింది భారత్ కు.

Gavaskar Reveals South Africa Clever Plan That Shackled Abhishek Sharma Rabada Targeted his Pads

అభిషేక్ శర్మ పేలవ ప్రదర్శనను భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ విశ్లేషించారు. అభిషేక్‌ను ఔట్ చేయడానికి దక్షిణాఫ్రికా వ్యూహాత్మకంగా ప్రణాళిక వేసిందని తెలిపారు. ముఖ్యంగా రబడ అతని ప్యాడ్‌లపై పదే పదే బంతులు వేసి విసిగించాడని, స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించే అవకాశం ఇవ్వలేదని వివరించారు. ఫలితంగా శర్మ తన సహజ ఫ్లోను కోల్పోయాడని, ఒత్తిడి అతనిపై తీవ్ర ప్రభావం చూపిందని, సహనం కోల్పోయిన దశలో జెన్ సెన్ వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరీనీ లాఫ్టెడ్ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడని అభిప్రాయపడ్డారు.

అభిషేక్ శర్మ బ్యాటింగ్ లో ఉండే సహజత్వం ఈ మ్యాచ్ లో కనిపించలేదని వ్యాఖ్యానించారు. నెట్స్‌లో ఒక బంతికి అవుట్ అయినా ఫర్వాలేదని, మ్యాచ్‌లో అలా ఉండదని గుర్తు చేశారు. ఒత్తిడి బ్యాటర్ కదలికలను స్తంభింపజేస్తుందని, స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వబోదని పేర్కొన్నారు. అలాంటి ఒత్తిడిని అభిషేక్ ఎదుర్కొన్నాడని అన్నారు. భారీ షాట్ ఆడాలనుకున్నప్పుడు చేతుల కదలిక స్వేచ్ఛగా ఉండాలని, అది అతనికి ఇబ్బంది పెట్టిందని విశ్లేషించారు.

అభిషేక్ శర్మ విషయంలో దక్షిణాఫ్రికా తెలివిగా బౌలింగ్ చేసిందని పేర్కొన్నారు గవాస్కర్. ఆఫ్ సైడ్ ఆడటానికి అతను వెసలుబాటు కోరుకుంటాడని బౌలర్లకకు తెలుసు కాబట్టే సిక్స్ కొట్టిన తర్వాత కూడా రబడ ప్యాడ్‌లపై పదేపదే గురిపెట్టి బంతులను సంధించాడని అన్నారు. అలాంటప్పుడు పెద్ద షాట్లకు అభిషేక్ శర్మ ప్రయత్నించకూడదని, బలవంతంగా ఆడాల్సిన అవసరం లేదని సూచించారు. సింగిల్స్ తీయడం, స్ట్రైక్ ను రొటేట్ చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+