Google- ICC: క్రికెట్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్, ఇక నుంచి..!!

క్రికెట్ ఫ్యాన్స్ కు ఇక కొత్త అనుభూతి అందబోతోంది. ప్రధాన మ్యాచ్ లను కోట్లాది మంది ఫ్యాన్స్ ప్రత్యక్ష ప్రసారంలో తిలకిస్తున్నారు. ఇందు కోసం అనేక ప్లాట్ ఫాంలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఐసీసీతో గూగుల్ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ విషయం గురించి ఎక్స్‌లో పోస్టు చేశారు. 'ఇప్పుడు గూగుల్.. మీ గూగ్లీకి సహాయం చేస్తుంది' అని పేర్కొన్నారు. ఇక.. క్రికెట్ లో ఈ నిర్ణయంతో కొత్త శకం ప్రారంభం కానుంది.

ప్రత్యక్ష మ్యాచుల విశ్లేషణను మరింత లోతుగా, ఆసక్తికరంగా మార్చేందుకు గూగుల్.. ఐసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రత్యక్ష మ్యాచుల వీడియో, ఆడియో వ్యాఖ్యానాన్ని అడ్వాన్స్‌డ్ ఏఐ
అడ్వాన్స్‌డ్ ఏఐ జెమిని 3 ప్రో విశ్లేషించనుంది. దీంతో అభిమానులు మ్యాచులను మరింత ఆస్వాదించేందుకు వీలుపడనుంది.

Google partners with the ICC to showcase AI-driven cricket analysis Complete details here

ఈ నిర్ణయానికి సంబంధించి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ విషయం గురించి ఎక్స్‌లో పోస్టు చేశారు. 'ఇప్పుడు గూగుల్.. మీ గూగ్లీకి సహాయం చేస్తుంది' అని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా ఏఐ జెమిని 3 ప్రో లైవ్ మ్యాచును గమనించి, కామెంటరీని విని, ఏం జరిగిందనేది సరళమైన భాషలో ఫ్యాన్స్‌కు వివరిస్తుంది. మ్యాచు హైలైట్స్, ఆటగాళ్లు, ఆటకు సంబంధించి ఇతర ఆసక్తికర విషయాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచనుంది.

ఈ అధునాతన సాంకేతికతను వాడి క్రికెట్‌ను మరింతగా అభిమానులకు చేరువ చేయడం కూడా ఈ భాగస్వామ్యం ఉద్దేశంగా వెల్లడించారు. అన్ని రంగాల్లోనూ విస్తరిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటలి జెన్స్ వినియోగం ఇప్పుడు క్రికెట్ ప్రత్యక్ష ప్రసారాల్లోనూ వినియోగించనున్నారు. ఇప్పటి వరకు ప్రఖ్యాత క్రికెటర్లు మ్యాచ్ ప్రసారం వేళ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆట సాగే తీరును ప్రేక్షకులకు వివరిస్తున్నారు. తమ అనుభవంతో ఆ మ్యాచ్ లో చోటు చేసుకుంటున్నా... జరిగే అవకాశం ఉన్న అంచనాలను వెల్లడిస్తున్నారు. కాగా, ప్రసార హక్కులు పొందిన బ్రాడ్ కాస్టర్లు స్థానిక భాషల్లోనూ ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులోకి తెచ్చాయి. కాగా, ఇప్పుడు గుగూల్ తో ఐసీసీ చేసుకున్న ఒప్పందం క్రికెట్ మ్యాచ్ ప్రసారాల్లో మరో దశకు తీసుకెళ్లనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+