జిమ్‌లో ఆ పనులేంటి భయ్యా?
Hardik Pandya-Mahieka Sharma: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. తన ప్రియురాలు మహీకా శర్మతో కలిసి దిగిన రొమాంటిక్ చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఆ ఫోటోలకు హార్దిక్ ఇచ్చిన క్యాప్షన్ 'మై బిగ్ 3' ఫ్యాన్స్ దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంది.
హార్దిక్ పాండ్యా తన జీవితంలో అత్యంత కీలకమైన ముగ్గురిని ఫోటోలలో చూపించాడు. 1. తన గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మ, 2. తన పెంపుడు జంతువులు, కుమారుడు అగస్త్య, 3. తన కెరీర్‌కు ప్రతీకగా క్రికెట్ బ్యాట్ ఎమోజీని ఫోటోలలో చూపించాడు. ఇందులో ప్రేమ, ఓం పవిత్ర మంత్రం ఎమోజీలు కూడా ఉన్నాయి. ఈ జంట కలిసి ప్రార్థన చేస్తున్న చిత్రం, అలాగే హార్దిక్ మహీకా బుగ్గపై ముద్దు పెడుతున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

జిమ్‌లోనే మొదలైన ప్రేమబంధం
హార్దిక్, మహీకా శర్మ మధ్య ప్రేమకు జిమ్ ఒక కీలక వేదికగా మారింది. వారు కలిసి వర్కౌట్ చేస్తున్న ఫోటోలు వారి బంధంలోని సరదా కోణాన్ని చూపుతున్నాయి. ఒక చిత్రంలో మహీకా శర్మ మిర్రర్ సెల్ఫీ తీసుకుంటుండగా.. హార్దిక్ ఆమెను అల్లరిగా తన భుజంపై ఎత్తుకున్నారు. ఈ చిత్రాలు వారిద్దరి మధ్య ఉన్న బలం, మంచి అనుబంధానికి నిదర్శనంగా నిలిచాయి. ఇద్దరూ కలిసి వ్యాయామం చేస్తూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండటం చూస్తంటే.. వారి సంబంధం జిమ్‌లోనే ప్రారంభమై ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.
మాల్దీవులలో హార్దిక్ బర్త్‌డే సెలబ్రేషన్స్
నటాష్ స్టాంకోవిచ్‌తో విడిపోయిన అనంతరం హార్దిక్ పాండ్యా తన వ్యక్తిగత జీవితాన్నిప్రైవేట్‌గా ఉంచుతూ వచ్చారు . కానీ ఇటీవల హార్దిక్ మహీకా శర్మతో తన బంధాన్ని ఇన్‌స్టా వేదికగా దాదాపు ధ్రువీకరించారు. అక్టోబర్ 11న హార్దిక్ తన 32వ పుట్టినరోజును గర్ల్‌ఫ్రెండ్ మహీకాతో కలిసి మాల్దీవుల్లోని అందమైన బీచ్ లొకేషన్‌లో జరుపుకున్నాడు. తాజాగా పోస్ట్ చేసిన చిత్రాలలో తన చేయి మహీకా శర్మ భుజంపై వేసి బీచ్‌లో హాయిగా ఉన్న ఫోటో, అలాగే నైట్ ఔట్ కోసం ఇద్దరూ అందంగా తయారైన చిత్రాలు ఉన్నాయి.
నటాషా-హార్దిక్ విడాకులు: 'కో-పేరెంటింగ్'కు నిర్ణయం
హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్‌ల విడాకుల వార్త గత ఏడాది జులైలో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 2020లో వివాహం చేసుకున్న ఈ జంట నాలుగేళ్ల అనుబంధం తర్వాత పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. "మేమిద్దరం మా వంతు ప్రయత్నం చేసాము, కానీ విడిపోవడమే మా ఇద్దరికీ ఉత్తమమని నమ్ముతున్నాము" అని హార్దిక్ ఓ ప్రకటనలో తెలిపారు. తమ ఇద్దరి జీవితంలో అగస్త్య కేంద్రంగా ఉంటాడని, అతనికి సంతోషాన్ని ఇవ్వడానికి తాము కో-పేరెంటింగ్‌గా (తల్లిదండ్రులుగా) కొనసాగుతామని హార్దిక్ స్పష్టం చేశారు. కుమారుడికి పూర్తి సమయం కేటాయిస్తూనే, హార్దిక్ తన జీవితంలో ప్రేమను కూడా స్వాగతించారు. మహీకా శర్మతో ఆయన కొత్త జీవితం ప్రారంభమవుతుండటంపై అభిమానులు, సెలబ్రిటీలు అభినందనలు తెలుపుతున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications