నా రాజును మించిన యోధుడు లేడు!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, ఆయన గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మ మధ్య బంధం మరింత బలపడింది. తాజాగా వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు బహిరంగంగా ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. భార్య నటాషా స్టోంకోవిక్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత హార్ధిక్, మహీకాలు తరచుగా కలిసి కనిపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు వీరిద్దరూ తమ బంధాన్ని అధికారకంగా ప్రేమగా ప్రకటించకపోవడం గమనార్హం. కానీ, తాజాగా జరిగిన సంఘటనల ద్వారా వీరిద్దరూ కేవలం 'గర్ల్‌ఫ్రెండ్-బాయ్‌ఫ్రెండ్' మాత్రమే కాదని.. వీరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని నిరూపించబడింది.
బహిరంగంగా పాపరాజీకి హార్దిక్ వార్నింగ్
కొద్ది రోజుల క్రితం, పాపరాజీ (బాలీవుడ్ మీడియా ఫోటోగ్రాఫర్లు) మహీకా శర్మను తప్పుడు యాంగిల్స్‌లో వీడియో తీయడాన్ని హార్దిక్ పాండ్యా తీవ్రంగా ఖండించారు. ఈ వీడియోపై ఆయన సోషల్ మీడియాలో బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాపరాజీని తీవ్రంగా హెచ్చరించారు.

విజయాన్ని పార్ట్‌నర్‌కు అంకితం చేసిన హార్దిక్
ఈ ఘటన జరిగిన వెంటనే హార్దిక్ పాండ్యా టీమిండియాలోకి తిరిగి వచ్చి అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. దీంతో జట్టు విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యా అందరి ముందు గెలుపు క్రెడిట్‌ను మహీకా శర్మకు ఇస్తూ, ఆమెను తన 'పార్ట్‌నర్'అని సంబోధించారు. హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, "నేను ప్రత్యేకంగా నా పార్ట్‌నర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆమె నా జీవితంలోకి వచ్చినప్పటి నుండి, చాలా మంచి విషయాలు జరిగాయి. ఆమె ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంది.నేను నా జీవితంలో ఎప్పుడూ నిజాయితీగా, యథార్థంగా ఉండటానికి ప్రయత్నించాను, అది నాకు చాలా సహాయపడింది. నేను దేన్నీ దాచను. ఇది ఎప్పుడూ ఇతరుల గురించి లేదా ప్రజలు ఏమనుకుంటున్నారనే దాని గురించి కాదు, నేను లోపల ఎలా భావిస్తున్నాను అనే దాని గురించే" అని హార్దిక్ తన హృదయాన్ని ఆవిష్కరించారు.
నువ్వు తప్ప మరొకరు లేరు నా రాజా..
హార్దిక్ 'పార్ట్‌నర్' అని సంబోధించడంతో కథ అక్కడితో ఆగలేదు. మహీకా శర్మ కూడా సోషల్ మీడియాలో బహిరంగంగా హార్దిక్‌కు కామెంట్ చేస్తూ స్పందించింది. ఆమె, "నీలాంటి వారు లేరు నా రాజా " అని రాసింది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఈ బహిరంగ ప్రేమ ప్రకటనలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇద్దరి మధ్య బంధం ఇంత దూరం వచ్చిందంటే, త్వరలోనే వీరిద్దరూ ఎప్పుడు వివాహం చేసుకోబోతున్నారు అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications