గర్ల్ ఫ్రెండ్ "మహికా"తో దొరికిపోయిన హార్దిక్ పాండ్యా.. వీడియో వైరల్ !!
భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొంతకాలంగా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు. తన మొదటి భార్య నటాషా స్టాంకోవిక్ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత బ్రిటిష్ గాయని జాస్మిన్ వాలియాతో రిలేషన్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు జాస్మిన్‌తో కూడా విడిపోయినట్లు కనిపిస్తున్న హార్దిక్.. మోడల్ మహికా శర్మతో రిలేషన్ లో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఇప్పుడు కలిసి మీడియాకి చిక్కారు. నటాషాతో విడాకులు తీసుకున్నాక హార్దిక్ తన 'రూమర్డ్' గర్ల్‌ఫ్రెండ్‌తో కనిపించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లేటెస్ట్ గా ముంబై ఎయిర్‌పోర్ట్ వద్ద హార్దిక్, మహికా కెమెరాలకు చిక్కారు. దీంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని భావిస్తున్నారు. కాగా కొన్నిరోజుల కిందట మోడల్ అయిన మహికా తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. అందులో ఓ వ్యక్తి సరిగ్గా కనిపించకుండా ఉన్నాడని.. అతడు హార్దిక్ పాండ్యేనని నెట్టింట జోరుగా చర్చ నడిచింది. ఇప్పుడు ఈ జంట ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో ఆ పాత క్లిప్‌లు మళ్లీ వైరల్ అవుతున్నాయి.
మహికా శర్మ ఎవరు?
మహికా శర్మ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఎదుగుతున్న ప్రముఖ మోడల్. ఆమె IFA మోడల్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. పలు ప్రసిద్ధ బ్రాండ్‌ల కోసం ర్యాంప్ వాక్ చేసింది. ఒక ఇంటర్వ్యూలో "పదో తరగతి పరీక్షల అనంతరం నేను మోడలింగ్‌నే కెరీర్‌గా ఎంచుకుంటానని నా తల్లిదండ్రులకు చెప్పాను" అని మహికా వెల్లడించిన విషయం అప్పట్లో చర్చనీయాంశమైంది.
హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం గత కొంతకాలంగా మీడియా దృష్టిలో ఉంది. నటాషా స్టాంకోవిక్‌తో వివాహ బంధం ముగిసిన తర్వాత ఆయన జాస్మిన్ వాలియాతో దగ్గరయ్యారని రూమర్లు వచ్చాయి. కానీ ఆ సంబంధం కూడా ఎక్కువకాలం నిలవలేదు. ఇప్పుడు మహికా శర్మతో రిలేషన్ రూమర్ల గురించి సోషల్ మీడియాలో అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు "హార్దిక్ మళ్లీ హ్యాపీగా కనిపిస్తున్నాడు" అని అభినందిస్తుంటే.. మరికొందరు ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఊహాగానాలు చేయడం తప్పని అంటున్నారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications