హార్దిక్ కొత్త లవర్ మహికా శర్మ.. కానీ గిఫ్ట్ మాత్రం నటాషాకా?

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన పర్సనల్ లైఫ్ విషయంలో ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. నటాషాతో విడాకులు తీసుకున్న తర్వాత హార్దిక్ పాండ్యా ప్రస్తుతం మహికా శర్మతో రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ తన మాజీ భార్య నటాషా, కుమారుడు అగస్త్య అవసరాలను హార్దిక్ పాండ్యా ఏమాత్రం విస్మరించడం లేదు. తాజాగా పాండ్యా వారిద్దరికీ రూ.4 కోట్ల విలువైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

కుమారుడు అగస్త్య కోసం బ్లాక్ ల్యాండ్ రోవర్ డిఫెండర్
హార్దిక్ పాండ్యా తన కుమారుడు అగస్త్య, మాజీ భార్య నటాషా కోసం నలుపు రంగులో ఉన్న ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. ఈ కారు ధర మార్కెట్‌లో సుమారు రూ.3 నుంచి 4 కోట్ల వరకు ఉంటుంది. షోరూమ్ నుంచి ఈ కారును తీసుకుంటున్న సమయంలో నటాషా, అగస్త్య ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Hardik Pandya Gifts Rs 4 Crore Luxury Car to Ex-Wife Natasa and Son Agastya Details Inside

అధికారికంగా ప్రకటించిన కంపెనీ
ఈ కారును హార్దిక్ పాండ్యానే గిఫ్ట్‌గా ఇచ్చారనే విషయాన్ని సదరు కారు తయారీ సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. షోరూమ్ ప్రతినిధులు ఫోటోలను షేర్ చేస్తూ.. "ఈ కారును హార్దిక్ పాండ్యా కొనుగోలు చేశారు. దీనిని అగస్త్య పాండ్యా, నటాషా స్టాంకోవిచ్‌కు ప్రెజెంట్ చేయడం జరిగింది" అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు. విడాకులు తీసుకున్నప్పటికీ.. తమ కుమారుడి పెంపకం విషయంలో వీరిద్దరూ అనుసరిస్తున్న తీరు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.

హార్దిక్-నటాషా బంధం
హార్దిక్ పాండ్యా, నటాషా 2020లో వివాహం చేసుకున్నారు. అదే ఏడాది జులై 30న వీరికి అగస్త్య జన్మించాడు. అయితే మనస్పర్థల కారణంగా వీరిద్దరూ 2024లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం హార్దిక్ తన కెరీర్, కొత్త రిలేషన్‌తో బిజీగా ఉన్నప్పటికీ.. కుమారుడి భవిష్యత్తు, సౌకర్యాల విషయంలో ఎక్కడా తగ్గడం లేదని ఈ గిఫ్ట్ ద్వారా స్పష్టమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+