భార్యకు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా విడాకుల వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. హార్దిక్ పాండ్యా భార్య నటాషా అతనికి విడాకులు ఇవ్వడానికి రెడీ అయిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మోడల్, హీరోయిన్ నటాషా స్టాంకోవిచ్‌ను హార్దిక్ పాండ్యా ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. 2020లో ఈ జంట వివాహం చేసుకున్నారు. రెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరు.. పెళ్లికి ముందే కమిట్ అయ్యారని తెలుస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. హార్దిక్ పాండ్యా,నటాషా స్టాంకోవిచ్‌లు పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే నటాషా తల్లి కాబోతుందనే వార్త బయటకు వచ్చింది. ఇక పెళ్లి తర్వాత ఈ జంట తమ దాంపత్య జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేశారు.
అయితే ఇటీవల వీరి కాపురంలో విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా ,నటాషాల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో వీరు ప్రస్తుతం విడిగా జీవనం కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఈ జంట విడాకులు తీసుకుంటున్నారని అంతా భావించారు. ఇదే సమయంలో నటాషా చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా చేసింది. నటాషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేసింది. 'ఒకరు రోడ్డున పడబోతున్నారు' అనే క్యాప్షన్‌తో ట్రాఫిక్ సిగ్నల్స్ ఫొటో షేర్ చేసింది. అయితే.. ఈ పోస్ట్ హార్దిక్ పాండ్యను ఉద్దేశించి పెట్టిందంటూ నెట్టింట రచ్చ మొదలు పెట్టారు నెటిజన్లు.దీనికి తోడు నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి పాండ్యా అనే ఇంటిపేరును తొలగించింది.

దీంతో నటాషా హార్దిక్ పాండ్యాకు విడాకులు ఇవ్వడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. నటాషా సెర్బియాకు చెందిన మహిళ కావడంతో భరణం అధికంగా అడిగే అకవాశాలు ఉన్నాయని న్యాయ నిపుణలు చెబుతున్నారు. హార్దిక్ పాండ్యా తన ఆస్తిలో 70 శాతం నటాషాకి ఇవ్వవలసి ఉంటుందని తెలుస్తోంది. ఈ కారణాలన్నింటి వల్లే పాండ్యా ఫ్యామిలీ ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడడం లేదని సమాచారం. ఇదిలా ఉంటే హార్దిక్ గతంలో ఇచ్చిన ఇంటర్య్వూ ఇప్పుడు వైరల్‌గా మారింది.
హార్దిక్ పాండ్యా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తల్లి నా వద్ద ఉన్న అన్ని ఖాతాలకు భాగస్వామిగా ఉంటుందని.. తన ఆస్తిలో రూ. 50% హక్కు తల్లికే చెందుతుందని హార్దిక్ చెప్పుకొచ్చారు. తాను ఏది కొన్నా.. అది కారు అయినా, ఇల్లు అయినా ప్రతిదానిలో అమ్మకు సమాన వాటా ఉంటుందని పేర్కొన్నాడు. "నాపై నాకు నమ్మకం లేదు. 50 శాతం ఆస్తి ఎవరికీ ఇవ్వను. 50 శాతం ఆస్తి నాకు చాలా పెద్దదంటూ ఈ ఇంటర్య్వూలో హార్దిక్ తెలిపారు. హార్దిక్ పాండ్యా ఆస్తి గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications