టీ20 వరల్డ్ కప్ రేపనగా.. టీమిండియాలో స్టార్ వికెట్ డౌన్

టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కావడానికి ఒక్క రోజు ముందు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ బౌలర్ జోష్ హేజిల్ వుడ్ గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. టోర్నీ మొత్తానికీ అతను అందుబాటులో ఉండట్లేదు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది కూడా. అతనికి ప్రత్యామ్నాయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే ముగ్గురు స్టార్ బౌలర్లు జట్టుకు దూరం అయ్యారు.

ఇప్పుడు ఇదే పరిస్థితి భారత జట్టులోనూ నెలకొంది. టీ20 వరల్డ్ కప్ నుంచి భారత ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా తప్పుకొన్నాడు. టోర్నీ మొత్తానికీ అతను అందుబాటులో ఉండట్లేదు. గాయం కారణంగా వైదొలిగినట్లు సమాచారం. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన వామప్ మ్యాచ్‌లో హర్షిత్ రాణా గాయపడ్డాడు. మ్యాచ్ కొనసాగుతున్న సమయంలోనే హర్షిత్ రాణా తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. అర్ధాంతరంగా గ్రౌండ్ ను వీడాడు. కీళ్ల వాపుతో అతను బాధపడుతున్నట్లు సమాచారం.

Harshit Rana Team India Pace bowler ruled out of T20 World Cup after injury in warm-up vs South Africa

ఒకే ఓవర్‌లో 16 పరుగులు సమర్పించుకున్నప్పుడు అతడి ఇబ్బంది స్పష్టంగా కనిపించింది. రెండుసార్లు తన రనప్‌ను ఆపేయాల్సి వచ్చిందతనికి. చివరికి మోకాలిపై కుప్పకూలిపోయాడు. తీవ్ర బాధతో మైదానాన్ని వీడిన అతను మళ్లీ తిరిగి రాలేదు. ఆ మ్యాచ్ అతను వేసింది ఒకే ఒక్క ఓవర్ మాత్రమే. అతని పరిస్థితి అంత బాగాలేదని కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా స్పష్టం చేశాడు. అర్ధాంతరంగా గ్రౌండ్ ను వీడిన హర్షిత్ రాణాకు వైద్య పరీక్షలను నిర్వహించారు. తాజాగా దీనికి సంబంధించిన రిపోర్టులు వచ్చాయి.

గాయంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ- హర్షిత్రాణా మాత్రం టోర్నమెంట్‌లో ఆడలేడని అక్కడి వర్గాలు ధృవీకరించాయి. సైడ్ స్ట్రెయిన్ కారణంగా ఇటీవలే న్యూజిలాండ్ సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను జట్టుతోనే ఉన్నాడన్న మాటే గానీ, పూర్తి ఫిట్ నెస్ తో లేడు. త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌ను పొందుతాడని అంచనా.

అలాగే టాప్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ కూడా జట్టుకు అందుబాటులో లేదు. న్యూజిలాండ్ తో సిరీస్‌కు అతను దూరం అయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ పూర్తి చేసుకుని వచ్చాక.. టీమిండియా ఏలో చోటు దక్కించుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో రెండు వామప్ మ్యాచ్‌లలోను సైతం ఆడాడు. హర్షిత్ రాణా అందుబాటులో లేనందు వల్ల కొత్త ప్లేయర్ ను బీసీసీఐ సెలెక్ట్ చేయాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+