SRHకు స్టార్ బ్యాటర్ గుడ్ బై..?

ఐపీఎల్ 2026 ఆక్షన్ గడువు సమీపిస్తోన్న కొద్దీ ఆయా జట్లల్లో భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకుంటోన్నాయి. సంజు శాంసన్.. రాజస్థాన్ రాయల్స్ ను వీడబోతున్నట్లు మొన్నటికి మొన్న వార్తలొచ్చాయి. జట్టుకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఐపీఎల్ 2026లో సీజన్ నుండి ఆ జట్టుతో కొనసాగకపోవచ్చు. ఇప్పుడతను ఢిల్లీ కేపిటల్స్ కు వెళ్లనున్నాడు. దీనికి సంబంధించిన వ్యవహారాలు లాంఛనంగా పూర్తవుతున్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌ కూడా జట్టును వీడబోతున్నాడని తెలుస్తోంది. ఐపీఎల్ 2026 ఆక్షన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఐపీఎల్ 2025 కోసం క్లాసెన్‌ను సన్‌రైజర్స్ 23 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. కేప్టెన్ పాట్ కమిన్స్ కంటే కూడా క్లాసెన్ ధర ఎక్కువ. ఆక్షన్ కోసం అతన్ని విడుదల చేసి, వేలంలో మళ్ళీ క్లాసెన్ కోసం పోటీపడాలని సన్‌రైజర్స్ యోచిస్తోంది.

Heinrich Klaasen likely to Depart Sunrisers Hyderabad

ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ నుండి క్లాసెన్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ లో కొనసాగనున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో ది బెస్ట్ బ్యాటర్లల్లో ఒకడు క్లాసెన్. ఈ సీజన్ లో 13 మ్యాచ్‌లల్లో 172.69 స్ట్రైక్ రేట్‌తో 487 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి. బ్యాటింగ్ యావరేజ్ 44.27. క్లాసెన్‌ను విడుదల చేసి, వేలంలో తిరిగి అతనిని కొనుగోలు చేయాలనేది సన్ రైజర్స్ హైదరాబాద్ వ్యూహంలో భాగమని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.

23 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తంతోనే అతన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీనివల్ల మిగిలిన ఆ మొత్తంతో అన్ క్యాప్డ్ లేదా ఆల్ రౌండర్ ను తీసుకోవడానికి వెసలుబాటు చిక్కినట్టవుతుందని సన్ రైజర్స్ హైదరాబాద్ భావిస్తోంది. మిడిల్ ఆర్డర్‌ బ్యాటింగ్ ను కూడా బలోపేతం చేసుకునే అవకాశాలు లేకపోలేదు. వేలంలో క్లాసెన్ కోసం దాదాపుగా 15 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాలని, మిగిలిన మొత్తంతో ఇతర ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చని ఎస్ఆర్ హెచ్ భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+