వరల్డ్ గ్రేటెస్ట్ ప్లేయర్లల్లో టీమిండియా పేసర్

Jasprit Bumrah: టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ స్పియర్‌హెడ్ జస్‌ప్రీత్ బుమ్రా మరోసారి వరల్డ్ గ్రేటెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. టెస్ట్ ఫార్మట్‌లో అతనిదే ఆధిపత్యం. ఏ ఫార్మట్‌లో అయినా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్‌లో అగ్రస్థానాన్ని అధిరోహించాడు.

నిన్నటి వరకు టెస్ట్ సిరీస్‌లో తీరిక లేకుండా గడిపింది భారత క్రికెట్ జట్టు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచుల్లోనూ విజయకేతనాన్ని ఎగురవేసింది. ఈ సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది. ఈ రెండింట్లోనూ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది బంగ్లాదేశ్.

ICC rankings Jasprit Bumrah reclaiming his position as the Number 1

ఈ సిరీస్‌ భారత ఖాతాలో పడటంలో కీలక పాత్ర పోషించాడు బుమ్రా. ఈ రెండు టెస్ట్ మ్యాచ్‌లల్లో 11 వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్‌లో నాలుగు, రెండో ఇన్నింగ్‌లో ఒక వికెట్ తీసుకున్నాడు. రెండో మ్యాచ్‌లోనూ నిప్పులు చెరిగాడు బుమ్రా. రెండు ఇన్నింగ్‌లల్లో మూడు చొప్పున వికెట్లను నేలకూల్చాడు.

ఈ పెర్‌ఫార్మెన్స్ అతన్ని ఐసీసీ టెస్ట్ ర్యాంక్‌లో టాప్ పొజీషన్‌లో కూర్చోబెట్టింది. మొత్తం 870 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు బుమ్రా. రెండో స్థానం కూడా భారత్‌దే. 869 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు వెటరన్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.

ఆ తరువాత జోష్ హేజిల్‌వుడ్- ఆస్ట్రేలియా (847), పాట్ కమ్మిన్స్- ఆస్ట్రేలియాతో పాటు కగిసొ రబడ- దక్షిణాఫ్రికా 820 సమాన పాయింట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. రవీంద్ర జడేజా- భారత్ (809), నాథన్ లియాన్- ఆస్ట్రేలియా, ప్రభాత్ జయసూర్య- శ్రీలంక 801 సమాన పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. కైలె జెమిసన్- న్యూజిలాండ్ (714), షహీన్‌ షా అఫ్రిది- 709 పాయింట్లతో తొలి 10 స్థానాల్లో ఉన్నారు.

కాగా- టెస్ట్ మ్యాచ్‌లల్లో న్యూజిలాండ్‌ను ఎదుర్కొనాల్సి ఉంది టీమిండియాకు. ఇంకొద్ది రోజుల్లో న్యూజిలాండ్ భారత పర్యటనకు రాబోతోంది. టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా ఢీ కొట్టబోతోంది. మొత్తం మూడు మ్యాచ్‌ల సిరీస్ ఇది. ఈ నెల 16న తేదీ ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దీనికి వేదిక.

24వ తేదీన పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నవంబర్ 1వ తేదీన ముంబై వాంఖెడే స్టేడియంలల్లో చివరి రెండు టెస్టులు షెడ్యూల్ అయ్యాయి. మ్యాచ్‌లన్నీ కూడా ఉదయం 9:30 గంటలకు ఆరంభమౌతాయి. వరల్డ్ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇవి జరుగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+