దిగజారిన యశస్వి జైస్వాల్: జాక్‌పాట్ కొట్టిన ఐపీఎల్ స్టార్..!!
Harry Brook: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.. తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. కొద్దిసేపటి కిందటే టెస్ట్ క్రికెట్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగానికి సంబంధించిన ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ కేటగిరీలో తొలి 10 స్థానాల్లో నిలిచిన క్రికెటర్ల పేర్లు ప్రకటించింది. ఇందులో ఇద్దరు భారత ప్లేయర్లు ఉన్నారు.
ఆ ఇద్దరూ టీమిండియా డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్. వీరిద్దరూ కూడా 4, 9 స్థానాల్లో నిలిచారు. వీరిద్దరి మధ్య ఉన్న పాయింట్లల్లో భారీ తేడా కనిపించింది. జైస్వాల్‌కు ఉన్న పాయింట్ల 811. కాగా రిషభ్ పంత్ ఖాతాలో 724 పాయింట్లు ఉన్నాయి. పాకిస్తాన్‌కు చెందన సవూద్ షకీల్ కూడా సరిగ్గా 724 పాయింట్లతో పదో స్థానానికి చేరుకున్నాడు. టాప్ 10లోకి వచ్చాడు.

ఇంగ్లాండ్‌కు చెందిన బ్యాటింగ్ సంచలనం హ్యారీ బ్రూక్ అగ్రస్థానాన్ని అధిరోహించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్‌లో అతను ఈ పొజీషన్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. మొత్తం 898 పాయింట్లను అందుకున్నాడీ డాషింగ్ బ్యాటర్. ఐపీఎల్ 2025లో ఢిల్లీ కేపిటల్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహించనున్న హ్యారీ బ్రూక్.. న్యూజిలాండ్‌పై జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లల్లో చెలరేగి ఆడుతున్న విషయం తెలిసిందే.
మిగిలిన వారిలో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ రెండో స్థానంలో నిలిచాడు. రూట్ సాధించన పాయింట్లు 897. ఒకే ఒక్క పాయింట్ తేడాతో అగ్రస్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. న్యూజిలాండ్ మాజీ కేప్టెన్ కేన్ విలియమ్సన్ మూడోస్థానంలో కొనసాగుతోన్నాడు. అతను అందుకున్న పాయింట్లు 812.
781 పాయింట్లతో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. శ్రీలంకకు కమిందు మెండిస్ 759 పాయింట్లతో ఫిఫ్త్ పొజీషన్‌లో నిలిచాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్ టెంబా బావుమా 753 పాయింట్లతో ఏడు, 729 పాయింట్లతో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిఛెల్ ఎనిమిది స్థానాల్లో ఉన్నారు.
టెస్ట్ ర్యాంకింగ్ బౌలింగ్ విభాగంలో టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా టాప్ పొజీషన్‌లో కొనసాగుతున్నాడు. అతని ఖాతాలో ఉన్న పాయింట్ల సంఖ్య 890. రెండో స్థానంలో కగిసొ రబడ (దక్షిణాఫ్రికా)- 856, జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా)- 851, పాట్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా)- 816, రవిచంద్రన్ అశ్విన్ (భారత్)- 797 పాయింట్లతో తొలి అయిదు స్థానాలో ఉన్నారు.
ఆ తరువాత రవీంద్ర జడేజా (భారత్)- 786, నాథన్ లియాన్ (ఆస్ట్రేలియా)- 779, ప్రభాత్ జయసూర్య (శ్రీలంక)- 768, మ్యాట్ హెన్రీ (న్యూజిలాండ్)- 764, నొమన్ అలీ (పాకిస్తాన్)- 759 పాయింట్లతో ఆరు నుంచి 10 స్థానాల్లో ఉన్నారు.












Click it and Unblock the Notifications