ICC World Cup 2023: వరల్డ్ కప్ సెమీ ఫైనలిస్టులు వీరే ? దినేష్ కార్తీక్ జోస్యం..!

ఐసీసీ వన్డే ప్రపంచకప్ జోరుగా సాగుతోంది. మొదట్లో పేలవంగా ఆరంభమైందని భావించినా రోజులు గడిచే కొద్దీ మ్యాచ్ లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. భారత్ లో పిచ్ లు పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలంగా మారిపోయాయని భావిస్తున్న తరుణంలో నిన్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ కు ఆతిధ్యమిచ్చిన చెన్నె పిచ్ బౌలర్లకూ సహకరించి మ్యాచ్ ను ఆసక్తికరంగా ముగిసేలా చేసింది. దీంతో వరల్డ్ కప్ కు తిరిగి ఊపు వచ్చేస్తోంది. ఈ తరుణంలో సెమీ ఫైనల్ కు చేరే జట్లు ఏవనే చర్చ మొదలైంది.

ఈసారి సెమీఫైనల్ బెర్తులు దక్కించుకునే నాలుగు జట్లు ఏవి అన్న అంశంపై చర్చ జరుగుతోంది. దీనికి పలువురు మాజీ క్రికెటర్లు, దిగ్గజాలు తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు. జోస్యాలు చెప్పేస్తున్నారు. ఇదే క్రమంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ దినేష్ కార్తీక్ కూడా తన అభిప్రాయం జోడించాడు. ఈసారి సెమీ ఫైనల్ కు చేరుకునే నాలుగు జట్లపై తన అంచనాను కూడా వెల్లడించాడు.

 Dinesh Karthik prediction on four semi finalists..

దినేష్ కార్తీక్ అంచనా ప్రకారం ఈసారి వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ కు చేరుకునే అవకాశాలు నాలుగు జట్లకు ఉన్నాయి. వాటిలో ఆతిధ్య జట్టు భారత్ తో పాటు పొరుగున ఉన్న పాకిస్తాన్, అలాగే చిరకాల ప్రత్యర్ధులు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కూడా ఉన్నాయి. ఈ నాలుగు జట్లకు సెమీస్ చేరుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కార్తీక్ విశ్లేషించాడు. ఇందుకు తగిన కారణాలను కూడా దినేష్ కార్తీక్ వెల్లడించాడు. దీంతో బలమైన జట్ల కంటే భారత ఉపఖండ పరిస్దితుల్ని సద్వినియోగం చేసుకునే జట్లే సెమీ ఫైనల్ కు వెళ్తాయనేది అర్ధమవుతోంది.

దినేష్ కార్తీక్ అంచనా ప్రకారం వన్డే ప్రపంచ కప్ 2023 సెమీఫైనల్స్‌లో చోటు దక్కించుకుంటుందని భావిస్తున్న నాలుగు జట్లు భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో కొంతకాలంగా స్థిరంగా మంచి ప్రదర్శన కనబరుస్తున్నాయి. అలాగే ప్రతిభావంతులైన ఆటగాళ్లను కూడా కలిగి ఉన్నాయి. దీంతో ఆయా అంశాలు ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో వారిని బలమైన పోటీదారులుగా మార్చాయన్నాడు.

సెమీఫైనలిస్ట్‌లలో ఒకరిగా భారతదేశాన్ని కార్తీక్ ఎంపిక చేసుకోవడం భారత క్రికెట్ జట్టుపై ఉన్న అంచనాలకు అనుగుణంగానే ఉంది. టీమిండియా ప్రస్తుతం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో బలంగా కనిపిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న ఇంగ్లండ్ తో పాటు అంతర్జాతీయ వేదికలపై నిలకడగా రాణిస్తుందని పేరుగాంచిన ఆస్ట్రేలియా కూడా సెమీఫైనల్ బెర్త్ లభించే అవకాశాలున్నట్లు కార్తీక్ చెప్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+