ICC World Cup 2023: కొంపముంచిన ఆ డబుల్ సెంచరీ- నిరాశ చెందానంటున్న మ్యాక్స్ వెల్ !
ఐసీసీ వన్డే వరల్డ్ కప్(ICC ODI World Cup 2023) లో ఆప్ఘనిస్తాన్ పై పోరులో డబుల్ సెంచరీతో ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడినట్లు ప్రశంసలు అందుకుంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ (Glenn Maxwell) తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన రికార్డు ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియాను ఏకంగా వరల్డ్ కప్ సెమీస్ లో నిలబెట్టిన మ్యాక్స్ వెల్ దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఈ ఇన్నింగ్స్ తన కొంప ముంచిందని తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మ్యాక్సీ వెల్లడించాడు.
తన కెరీర్లో 128 బంతుల్లోనే తొలిసారి డబుల్ సెంచరీ సాధించిన ఈ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మ్యాక్ వెల్ ఇప్పుడు ఆ ఇన్నింగ్స్ కారణంగా తనకు ఓ విషయంలో నష్టం జరిగిందని చెప్పుకొచ్చాడు. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్ క్రిస్ట్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తో కలిసి ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న మ్యాక్స్ వెల్ తన డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ కారణంగా ఏ విషయంలో తనకు నష్టం జరిగిందో వెల్లడించాడు. దీంతో ఈ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న గిల్ క్రిస్ట్, మైకేల్ వాన్ సైతం నోరు వెళ్లబెట్టారు.

ఆప్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో తన డబుల్ సెంచరీ మ్యాచ్ ను గెలిపించడమే కాకుండా సెమీస్ లో ఆస్ట్రేలియాను చేర్చించిందన్న విషయాన్ని పక్కనబెడితే తనకు నిరాశ కలిగించిని మ్యాక్స్ వెల్ చెప్పుకొచ్చాడు. ఈ డబుల్ సెంచరీ కారణంగా తన స్ట్రైక్ రేట్ తగ్గిపోయిందని మ్యాక్సీ వెల్లడించాడు. వరల్డ్ కప్ లో తన బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తగ్గడానికి ఈ ఇన్నింగ్స్ కారణమైందని మ్యాక్స్ వెల్ తెలిపాడు. ఇప్పుడు తిరిగి మునుపటి స్ట్రైక్ రేట్ సాధించడానికి కష్టపడాల్సి ఉందని తెలిపాడు.
ఆప్ఘనిస్తాన్ పై రికార్డు ఇన్నింగ్స్ తో దేశ విదేశాల్లో గ్లెన్ మ్యాక్స్ వెల్ పేరు మార్మోగుతుండగా... తాను మాత్రం వరల్డ్ కప్ స్ట్రైక్ రేట్ తగ్గిందని బాధపడుతుండటంపై ఈ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న గిల్ క్రిస్ట్, మైకేల్ వాన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే మ్యాక్సీకి ఆ స్ట్రైక్ రేట్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని వారు అభిప్రాయపడ్డారు. మ్యాక్స్ వెల్ కు ఇంకా మంచి కెరీర్ ఉందని, ఇలాంటి ఇన్నింగ్స్ మాత్రం అరుదుగా వస్తాయని వారు వెల్లడించారు.












Click it and Unblock the Notifications