SL vs ENG : ఇంగ్లండ్ కు చుక్కలు చూపించిన లంక బౌలర్లు- 156కే ఆలౌట్..

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కీలక మ్యాచ్ లో ఇంగ్లండ్ కు శ్రీలంక బౌలర్లు చుక్కలు చూపించారు. పటిష్టమైన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ ను అలవోకగా కుప్పకూల్చారు. ఇంగ్లండ్ కు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సంతోషం ఎక్కడా నిలవకుండా చేసిన లంక బౌలర్లు.. క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఇంగ్లిష్ జట్టు కేవలం 33.2 ఓవర్లలోనే 156 పరుగులకు ఆలౌటైంది.

వరల్డ్ కప్ లో వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్-శ్రీలంక జట్ల మధ్య ఇవాళ బెంగళూరు లో జరుగుతున్న లీగ్ మ్యాచ్ పై ఆసక్తి పెరిగింది. ఈ మ్యాచ్ లో గెలిస్తే తప్ప టోర్నీలో సెమీ ఫైనల్ ఆశలు నిలబెట్టుకోవడం కష్టంగా మారిన నేపథ్యంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఓపెనర్లు జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలాన్ శుభారంభమే ఇచ్చారు. తొలి వికెట్ కు 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక లంక బౌలర్లు ఈ జోడీని విడదీశారు.

ICC World cup: England all-out for 156 with Sri lankan pace attack in bengaluru

చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చిన వెటరన్ ఏంజెలో మ్యాథ్యూస్ బౌలింగ్ లో డేవిడ్ మలాన్ (28) వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం వన్ డౌన్ లో వచ్చిన జో రూట్ (3)రనౌట్ కావడంతో ఇంగ్లండ్ 57 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఈ దశలో ధాటిగా ఆడుతున్న మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టోను (30)పేసర్ రజిత వెనక్కి పంపాడు. దీంతో 68 పరుగులకు ఇంగ్లిష్ జట్టు మూడో వికెట్ పొగొట్టుకుంది. ఆ తర్వాత వెంటనే జోస్ బట్లర్ కూడా 8 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ 77 పరుగులకే నాలుగో వికెట్లు నష్టపోయింది.

ఆ తర్వాత కూడా ఇంగ్లండ్ వికెట్ల పతనం ఆగలేదు. 85 పరుగుల వద్ద లివింగ్ స్టోన్ (1)ని లహిరు కుమార ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపడంతో ఇంగ్లండ్ ఐదు వికెట్ కోల్పోయింది. ఈ దశలో మొయిన్ అలీ.. బెన్ స్టోక్స్ జోడీ కాస్త నిలదొక్కుకుంది. నిలకడగా పరుగులు రాబడుతూ స్కోరును వంద పరుగులు దాటించింది. 122 పరుగుల వద్ద మొయిన్ అలీ క్యాచ్ అవుట్ కావడంతో ఇంగ్లండ్ 6వ వికెట్ కోల్పోయింది. వెంటనే క్రిస్ ఓక్స్ అవుటయ్యాడు. చివర్లో విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ వికెట్లు వరుసగా తీసిన లంక ఇంగ్లండ్ ను 156 పరుగులకే కట్టడి చేసింది. లంక బౌలర్లలో కుమారకు 3, మ్యాథ్యూస్ కు 2, రజితకు 2, తీక్షణకు ఓ వికెట్ దక్కాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+