Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రెండో పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ టీ20 స్పెషలిస్ట్- మొదటి భార్య శాపనార్థాలు

పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం రెండో పెళ్లి చేసుకున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ నైలా రజాను పెళ్లాడాడు. మొదటి భార్య సానియా అష్ఫాక్‌తో విడిపోయిన కొన్ని నెలలకే నైలా రాజాతో నిఖా ముగిసింది. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ లో దీనికి సంబంధించిన వివరాలను పోస్ట్ చేశాడు. తన జీవితంలో అత్యంత కఠినమైన దశను దాటి వచ్చానని పేర్కొన్నాడు. మొదటి వివాహం విజయవంతం కాకపోయినా ఆ బంధం ద్వారా తనకు బంగారం లాంటి పిల్లలు లభించారని, అదే అతిపెద్ద ఆశీర్వాదంగా భావిస్తున్నానని చెప్పాడు.

తొలి వివాహ బంధంలో అవసరానికి మించి ఎక్కువ కాలం ఉన్నానని, ఆ సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు ప్రస్తుతం పశ్చాత్తాప పడుతున్నానని ఇమాద్ అంగీకరించాడు. మౌనం, ఆలస్యం కారణంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని, అందుకు పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశాడు. అల్లా దయ, తల్లిదండ్రుల మార్గదర్శకత్వంతో నైలా అనే మహిళను నిఖా చేసుకున్నట్లు తెలిపాడు. శాంతి, స్థిరత్వం, పరస్పర గౌరవం ఆధారంగా జీవితాన్ని నిర్మించుకోవడానికి ఈ నిర్ణయం చాలా ఆలోచించి తీసుకున్నదని పేర్కొన్నాడు.

Imad Wasim Pakistan Cricketer tied the knot with girlfriend Nyla Raja After Split from Sannia Ashfaq

ఇమాద్ తన పిల్లలను ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. తండ్రిగా ఉండటం అంటే బాధ్యతలు నిర్వర్తించడం మాత్రమే కాదని, అందుబాటులో ఉండటం, ప్రేమించడం, మార్గనిర్దేశం చేయడం కూడా అని చెప్పాడు. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రస్తుతం తాను తన పిల్లలను కలవలేకపోతున్నానని, వారి జీవితంలో చురుకైన పాత్ర పోషించడమే తన అతిపెద్ద కోరిక అభివర్ణించాడు. తన వ్యక్తిగత జీవితాన్ని గౌరవించి, గోప్యత పాటించాలని ప్రజలను కోరాడు.

ఇమాద్ వసీమ్, సానియా అష్ఫాక్‌ల వివాహం 2019 ఆగస్టులో ఇస్లామాబాద్‌లో జరిగింది. వారికి ఇనాయా అనే కుమార్తె, రాయన్, జయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 2005లో ఇద్దరూ విడిపోయారు. విడాకుల అనంతరం కూడా తన పిల్లల పెంపకం బాధ్యతలు తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఇమాద్ ప్రకటించాడు. అదే ఏడాది చివరిలో నైనా రజాతో లండన్ లో పరిచయం ఏర్పడింది ఇమాద్ కు. ఆమె సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్. వారిది ప్రేమవివాహం. పాకిస్తాన్ తరపున 55 వన్డేలు, 75 T20 ఇంటర్నేషనల్స్ ఆడాడు ఈ ఆల్‌రౌండర్.

అతని రెండో వివాహం తర్వాత, మాజీ భార్య సానియా అష్ఫాక్ తెరమీదికి వచ్చారు. షాకింగ్ ఆరోపణలు చేశారు. కడుపులో ఉన్న బిడ్డను హత్య చేశాడని అన్నారు. 2023 డిసెంబర్‌లో లాహోర్‌లో తన అనుమతి లేకుండా గర్భస్రావం చేయించి బిడ్డను హత్య చేశాడని ఆరోపించారు. ఈ సంఘటనకు సంబంధించి తన వద్ద వీడియో సాక్ష్యాలున్నాయని పేర్కొన్నారు. ఆరు సంవత్సరాల తమ వైవాహిక జీవితంలో ఇమాద్ తనని తీవ్రంగా మానసికంగా వేధించాడని కూడా సానియా తన ఆరోపణల్లో పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+