8 డిగ్రీల గడ్డ కట్టించే చలిలో టీమిండియా టీ20 మ్యాచ్

IND vs AFG 1st T20: ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్స్‌లో ఓటమి తరువాత.. భారత జట్టు వరుస జైత్రయాత్రలను కొనసాగిస్తోంది. వరల్డ్ కప్ ముగిసిన తరువాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో విజయదుందుభి మోగించింది. అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనను విజయవంతంగా ముగించింది.

ఇక తాజాగా స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌ను ఎదుర్కొనడానికి సమాయాత్తమౌతోంది. మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్ ఇది. భారత్- ఆఫ్ఘనిస్తాన్ మధ్య తొలి మ్యాచ్ ఈ సాయంత్రం 7 గంటలకు మొహాలీ స్టేడియంలో ఆరంభం కానుంది. 14, 17 తేదీల్లో ఇండోర్, బెంగళూరుల్లో మిగిలిన రెండు మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి.

IND vs AFG 1st T20: Temperature at Mohali stadium expected to fall down below 10° during tonight

ఈ మ్యాచ్‌లో విజయం సాధించడానికి రెండు జట్లూ నెట్స్‌‌లో చెమటోడ్చాయి. టీమిండియాలో విరాట్ కోహ్లీ ఆడట్లేదు. ఆఫ్ఘనిస్తాన్‌ జట్టులో రషీద్ ఖాన్ గైర్హాజర్ అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో ఈ ఒక్క మ్యాచ్‌కు మాత్రమే కోహ్లీ అందుబాటులో ఉండట్లేదు. వెన్నునొప్పి వల్ల ఆఫ్ఘన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్.. ఈ సిరీస్ నుంచి వైదొలిగాడు. మూడు మ్యాచ్‌లల్లో కూడా ఆడట్లేదు.

సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా కూడా ఈ సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. వారి స్థానంలో తిలక్ వర్మ, రింకూసింగ్‌లకు చోటు దక్కింది. అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్‌.. తుది జట్టులో చోటు దక్కించుకోవచ్చు. కోహ్లీ అందుబాటులో లేకపోవడం వల్ల ఓపెనర్ శుభ్‌మన్ గిల్ టాప్ ఆర్డర్‌లో ఆడబోతోన్నాడు. అతని స్థానంలో లెఫ్ట్ హ్యాండర్ యశస్వి జైస్వాల్.. ఇన్నింగ్‌ను ఆరంభిస్తాడు.

ఈ మ్యాచ్‌లో ఉష్ణోగ్రత గెలుపోటములను నిర్దేశించడం ఖాయంగా కనిపిస్తోంది. ఉత్తరాదిన ఇప్పటికే చలి వణికిస్తోన్న విషయం తెలిసిందే. రాత్రి ఉష్ణోగ్రత 6 డిగ్రీల వరకూ పడిపోతూ వస్తోంది. ఈ మ్యాచ్‌లో కూడా అలాంటి వాతావరణమే ఉండబోతోంది. మ్యాచ్ కొనసాగుతున్న కొద్దీ టెంపరేచర్ క్షీణిస్తూ ఉంటుందని, కనిష్ఠంగా 8 డిగ్రీల వరకు నమోదవుతుందని అక్యూ వెదర్ తెలిపింది.

మ్యాచ్ మొదలయ్యే సమయానికి 14 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండొచ్చని అంచనా వేసింది అక్యూవెదర్. క్రమంగా ఇది 8 డిగ్రీల వరకు క్షీణిస్తుందని, రాత్రి 11 గంటల వరకు మ్యాచ్ కొనసాగితే.. ఈ సంఖ్య మరింత పడిపోవచ్చని పేర్కొంది. గడ్డ కట్టించే చలిలో టీమిండియా ప్లేయర్లు.. ఆఫ్ఘనిస్తాన్‌తో తమ తొలి టీ20 మ్యాచ్‌ను ఆడబోతోన్నారు.

టీమిండియా తుదిజట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, తిలక్ వర్మ, జితేష్ శర్మ/సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ ఆడే అవకాశాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+