భారత్‌పై ఆసీస్ ప్రతీకార విజయం

అహ్మదాబాద్: ఇంకొద్దిరోజుల్లో ప్రపంచకప్ 2023 టోర్నమెంట్ ఆరంభం కాబోతోంది. ఇప్పటికే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు భారత్‌కు చేరుకున్నాయి. అన్ని జట్ల కంటే ముందే అడుగుపెట్టిన ఆస్ట్రేలియా టీమ్.. భారత్‌తో వన్డే సిరీస్‌ను కూడా ఆడేసింది. 2-1 తేడాతో దీన్ని కోల్పోయింది.

తొలి రెండో వన్డేల్లో ఓటమిపాలైన ఆస్ట్రేలియా.. చివరిదైన మూడో మ్యాచ్‌లో మాత్రం చెలరేగింది. టీమిండియా బౌలర్ల దుమ్ము దులిపింది. ఓ రకంగా చెప్పాలంటే భారత్‌పై ప్రతీకార విజయాన్ని సాధించింది ఆసీస్. వరల్డ్ కప్ 2023 ప్రారంభం కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌‌ను విజయంతో ముగించుకుంది.

IND vs AUS 3rd ODI: Australia defeat India by 66 runs

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియాకు నిర్దేశించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్- 56, మిఛెల్ మార్ష్- 96, స్టీవెన్ స్మిత్- 74, మార్నుస్ లాంబుషేన్- 72 పరుగులు చేశారు. మిడిల్ ఓవర్లల్లో భారత బౌలర్లు గాడిన పడినప్పటికీ- అప్పటికే స్కోర్ బోర్డ్‌ 300 పరుగులను దాటేసింది.

భారత బౌలర్లల్లో జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లను పడగొట్టాడు గానీ భారీగా పరుగులను సమర్పించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 10 ఓవర్ల కోటాలో ఏకంగా 81 పరుగులు ఇచ్చుకున్నాడు బుమ్రా. కుల్‌దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఒక్కో వికెట్‌తో సరి పెట్టుకున్నారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా- చివరి వరకూ పోరాడింది గానీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయంది. 49.4 ఓవర్లల్లో 286 పరుగులకు ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ 81 పరుగులతో సత్తా చాటాడు. విరాట్ కోహ్లీ- 56, శ్రేయాస్ అయ్యర్- 48 పరుగులు చేశారు. రవీంద్ర జడేజా- 35, కేఎల్ రాహుల్- 26, వాషింగ్టన్ సుందర్- 18 పరుగులు చేయగలిగారు.

ఆస్ట్రేలియా బౌలర్లల్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ నాలుగు వికెట్లతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచాడు. టాప్ ఆర్డర్ వికెట్లు- రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్‌ను బలి తీసుకున్నాడు మ్యాక్సీ. హేజిల్‌వుడ్-2 వికెట్ల కూల్చగా.. మిఛెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్, కామెరాన్ గ్రీన్, తన్వీన్ సంఘా ఒక్కో వికెట్ పడగొట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+