అల్లు అర్జున్‌ను గుర్తు చేసిన నితీష్ కుమార్ రెడ్డి

Rohit Sharma: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పోరాడుతోంది. నిప్పులు చెరుగుతున్న ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఎదురొడ్డి నిలిచింది. మూడో రోజు ఏడు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. ఫాలో ఆన్ ప్రమాదం నుంచి తప్పించుకుంది.

ఈ సెషన్‌లో హైలైట్‌గా నిలిచాడు నితీష్ కుమార్ రెడ్డి. హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో ఇదే అతని మొట్టమొదటి అర్ధసెంచరీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నాలుగు ఫోర్లు, ఒక భారీ సిక్సర్‌తో 61 పరుగుల మీద ఆడుతున్నాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో వాషింగ్టన్ సుందర్ అతనికి సహకరిస్తోన్నాడు.

IND vs AUS Nitish Kumar Reddy maiden Test 50 helps India to avoid follow-on against Australia

తొలి ఇన్నింగ్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఆ జట్టు టాప్ ఆర్డర్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్ సెంచరీతో చెలరేగాడు. 140 పరుగులు చేశాడు. కేప్టెన్ పాట్ కమ్మిన్స్ అతనికి అద్భుత సహకారాన్ని అందించాడు. ఒకవైపు స్టీవెన్ స్మిత్.. మరో ఎండ్‌లో పాట్ కమ్మిన్స్ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. టీమిండియా బౌలర్లను బెంబేలెత్తించారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభంలోనే వికెట్లను కోల్పోయింది. కేప్టెన్ రోహిత్ శర్మ మూడు పరుగులకే అవుట్ అయ్యాడు. అయిదే అయిదు బంతులను ఎదుర్కొని పెవిలియన్ దారి పట్టాడు. టాప్ ఆర్డర్‌లో విరాట్ కోహ్లీ నిరాశ పరిచాడు. 36 పరుగులకే అవుట్ అయ్యాడు. నైట్ వాచ్‌మెన్‌గా బరిలోకి దిగిన ఆకాష్ దీప్ డకౌట్ కావడం టీమిండియా ఇన్నింగ్‌ను దెబ్బకొట్టింది.

అయిదు వికెట్ల నష్టానికి 164 పరుగుల వద్ద మూడో రోజు ఆటను ఆరంభించింది టీమిండియా. ప్రారంభంలోనే రెండు వికెట్లను కోల్పోయింది. రిషభ్ పంత్- 28, రవీంద్ర జడేజా- 17 పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టారు. 221 పరుగులకు ఏడు వికెట్లను నష్టపోయి కష్టాల్లో పడిన జట్టును నితీష్ కుమార్ రెడ్డి ఆదుకున్నాడు.

భారీ షాట్లు ఆడాడు. నాథన్ లియాన్ బౌలింగ్‌లో బౌలర్ తల మీదుగా లాంగాన్‌లో కొట్టిన భారీ సిక్స్.. అతని ఇన్నింగ్‌లో హైలైట్. మిడిల్ స్టంప్ మీద పడి లేచిన బంతిని ఫ్రంట్ ఫుట్ ఆడాడు నితీష్. మెరుపువేగంతో ఫెన్సింగ్ దాటిందా బంతి. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి మరో వికెట్ పడకుండా దూకుడుగా ఆడుతున్నాడు.

ఈ క్రమంలో తన మొట్టమొదటి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే పుష్ప సిగ్నేచర్ ఇచ్చాడు. అల్లు అర్జున్ స్టైల్‌లో తగ్గేదే లేదన్న సంకేతం ఇచ్చాడు. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో 50కి పైగా బ్యాటింగ్ యావరేజ్‌ను అందుకున్న ఏకైక టీమిండియా బ్యాటర్ అతనొక్కడే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+