రోహిత్ శర్మ స్టన్నర్: అలా ఎలా ఎగిరాడో గానీ..!!

Rohit Sharma catch: కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజృంభిస్తోంది. నాలుగో రోజు తొలి ఇన్నింగ్‌లో బంగ్లాను కట్టడి చేసింది. భోజన విరామ సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెంచరీ హీరో మొమినుల్ హక్, లోయర్ ఆర్డర్ బ్యాటర్ మెహదీ హసన్ రజా క్రీజ్‌లో ఉన్నారు.

టీమిండియా బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాటర్లెవరూ నిలవలేకపోయారు.. ఒక్క మొమినుల్ హక్ మినహా. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన హక్.. ఒక సిక్సర్, 16 బౌండరీలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 102 పరుగులతో క్రీజ్‌లో నిలిచాడు. మిగలిన బ్యాటర్లెవరూ కూడా భారీ స్కోర్ చేయడంలో ఘోరంగా విఫలం అయ్యారు.

IND vs BAN 2nd test Rohit Sharma stunned with his one-handed catch sent Litton Das to pavilion

ఓపెనర్ జకీర్ హసన్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ షద్మన్ ఇస్లాం- 24, కేప్టెన్ నాజ్ముల్ హొస్సేన్ శాంటో- 31, ముష్ఫికర్ రహీం- 11, షకీబల్ హసన్- 9, లిట్టన్ దాస్- 13 పరుగులకు అవుట్ అయ్యారు. భారత బౌలర్లల్లో ఒక్క రవీంద్ర జడేజా మినహా మిగిలిన వారందరూ వికెట్లను పడగొట్టారు.

రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్ రెండేసి చొప్పున వికెట్లు తీసుకున్నారు. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ కూల్చారు. కాగా- సిరాజ్ బౌలింగ్‌లో లిట్టన్ దాస్‌ను అవుట్ చేయడానికి కేప్టెన్ రోహిత్ శర్మ పట్టిన క్యాచ్ అద్భుతం అనిపించింది.

మహ్మద్ సిరాజ్ వేసిన ఇన్నింగ్ 50వ ఓవర్ నాలుగో బంతికి మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు లిట్టన్ దాస్. తన తల మీదుగా బౌండరీ వైపు దూసుకెళ్తోన్న ఆ బంతిని గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అద్భుతంగా అందుకున్నాడు రోహిత్ శర్మ. వేలి అంచులతో బంతిని అందుకున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగించింది. తనకు తానే నమ్మలేకపోయాడు రోహిత్ శర్మ.

ఆ క్యాచ్ మిస్ అయివుంటే బౌండరీ ఖాయం అయ్యేదే. లిట్టన్ దాస్ రూపంలో 148 పరుగుల వద్ద అయిదో వికెట్‌ను కోల్పోయింది బంగ్లాదేశ్. ఆ తరువాత వచ్చిన షకీబుల్ హసన్ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిల్చోలేకపోయాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ అందుకున్న మరో సూపర్ క్యాచ్‌తో వెనుదిరిగాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+