టీమిండియాకు షాక్- బుమ్రా అవుట్
Jasprit Bumrah: ఇంగ్లాండ్‌తో విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ- వీడీసీఏ స్టేడియంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్.. ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ఎదురైన పరాజయానికి ప్రతీకారాన్ని తీర్చుకుంది. అయిదు టెస్ట్ మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
తొలి ఇన్నింగ్‌లో 396 పరుగులు చేసిన టీమిండియా..రెండో ఇన్నింగ్‌లో తడబడినప్పటికీ.. ప్రత్యర్థికి 398 పరుగుల భారీ లక్ష్యాన్నే నిర్దేశించగలిగింది. తొలి ఇన్నింగ్‌లో ఇంగ్లాండ్‌ను 253 పరుగులకే కట్టడి చేసిన భారత బౌలర్లు.. రెండో ఇన్నింగ్‌లో మరింత చెలరేగారు. 292 పరుగులకు బ్యాటింగ్ ఆర్డర్ మొత్తాన్నీ కుప్పకూల్చారు.

ఈ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా ఎలా బౌలింగ్ చేశాడో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. పదునైన యార్కర్లను సంధించాడు. అవుట్ స్వింగర్లు, ఇన్ కట్టర్‌లతో బ్యాటర్లను బెంబేలెత్తించాడు. తొలి ఇన్నింగ్‌లో ఒల్లె పోప్, కేప్టెన్ బెన్ స్టోక్స్‌ను అవుట్ చేసిన తీరు అద్భుతం. ఈ మ్యాచ్ మొత్తానికీ ఆ యార్కర్లు.. హైలైట్‌గా చెప్పుకోవచ్చు.
బుమ్రా చేతి నుంచి వెలువడే బంతులకు బ్యాటర్ల వద్ద సమాధానమే లేకపోయింది. ఒల్లె పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, టామ్ హార్ట్లే, జేమ్స్ అండర్సన్‌ను పెవలియన్ దారి పట్టించాడు బుమ్రా. రెండో ఇన్నింగ్‌లోనూ తన ప్రతాపాన్ని కొనసాగించాడు. జానీ బెయిర్ స్టో, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లేను అవుట్ చేశాడు. మొత్తంగా విశాఖపట్నం గడ్డపై తొమ్మిది వికెట్లను నేలకూల్చాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు.
ఇక మూడో టెస్ట్‌లోనూ ఇంగ్లాండ్‌ను ఓడించి.. సిరీస్‌లో ముందడుగు వేయాలనే పట్టుదలతో ఉన్న టీమిండియాకు అనూహ్యంగా షాక్ తగిలింది. ఈ టెస్ట్‌కు జస్‌ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడు. మూడో టెస్ట్ మ్యాచ్ ఆడే తుదిజట్టు కోసం తన పేరును పరిగణనలోకి తీసుకోవద్దని అతను బీసీసీఐకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
ఈ నెల 15వ తేదీన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. వర్క్ లోడ్‌లో భాగంగా విశ్రాంతి తీసుకోవాలని బుమ్రా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే వర్క్ లోడ్‌లో భాగంగా రెండో టెస్ట్ నుంచి మహ్మద్ సిరాజ్ తప్పుకొన్న విషయం తెలిసిందే. అతన్ని మళ్లీ జట్టులోకి తీసుకోవచ్చు. మహ్మద్ షమీ అందుబాటులో లేడు. మడమ గాయానికి చికిత్స తీసుకుంటోన్నాడు.
-
Hormuz: హార్ముజ్ లో అసలు నష్టం భారత్ కే? కేంద్రం షాకింగ్ ..! -
ఆంజనేయుడి దివ్యమంత్రం -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!!












Click it and Unblock the Notifications